
జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘యముడు’ సినిమా నుండి ‘ధర్మో రక్షతి’ అనే పాట విడుదలైంది. జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రావణి శెట్టి హీరోయిన్.
Key Points
జగదీష్ ఆమంచి నటించిన ‘యముడు’ సినిమా నుండి ‘ధర్మో రక్షతి’ పాట విడుదల.
శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో ఉంది.
వంశీ సరోజిని వికాస్ రచించిన పాటను భవాని రాకేష్ స్వరపరిచాడు.
సినిమా త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది.
‘యముడు’ సినిమా గురించి
Yamudu Song : జగన్నాధ పిక్చర్స్ బ్యానర్ పై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘యముడు’. ధర్మో రక్షతి రక్షితః అనేది ఉప శీర్షిక. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ లో ఈ యముడు సినిమా తెరకెక్కుతుంది.
‘ధర్మో రక్షతి’ పాట వివరాలు
ఇప్పటికే యముడు సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ‘ధర్మో రక్షతి..’ అంటూ సాగే ఓ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను వంశీ సరోజిని వికాస్ రాయగా భవాని రాకేష్ సంగీత దర్శకత్వంలో సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి పాడారు. యముడి కర్తవ్యాన్ని, బాధ్యతల్ని చాటి చెప్పేలా ఈ పాట సాగింది. మీరు కూడా పాట వినేయండి..
సినిమా విడుదల తేదీ
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న యముడు సినిమా త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
‘యముడు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ‘ధర్మో రక్షతి’ పాటను ఆలకించండి.


