|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యష్ ‘టాక్సిక్’: ‘తబాహి’తో బాక్సాఫీస్ బద్దలు! ఫస్ట్ సింగిల్ రిలీజ్!

Published: 02-03-2026, 4:05 AM
  • యష్ కొత్త చిత్రం ‘టాక్సిక్’ నుంచి మొదటి సింగిల్ ‘తబాహి’ విడుదలైంది.
  • విశాల్ మిశ్రా స్వరపరచి పాడిన ఈ పాటలో యష్, కియారా అద్వానీల కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
  • రామజోగయ్య శాస్త్రి తెలుగు వెర్షన్‌కు సాహిత్యం అందించారు, పాట ఐదు భాషల్లో విడుదలైంది.
  • ‘టాక్సిక్’ గ్లింప్స్ ఇప్పటికే 400 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది.

కేజీఎఫ్ సిరీస్‌తో పాపులర్ అయిన యష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం నుంచి మొదటి పాట ‘తబాహి’ విడుదలైంది. ఈ పాటను విశాల్ మిశ్రా స్వరపరచగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’: ఫస్ట్ సింగిల్ విశేషాలు

Toxic First Single: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ యష్ నుంచి రాబోతున్న మరో చిత్రం ‘టాక్సిక్’ (Toxic) . ఈ సినిమా విడుదల కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాలను మరింత పెంచుతూ, మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ను ‘తబాహి’ (Tabaahi)ని విడుదల చేశారు నిర్మాతలు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో యష్ సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా ఈ పాటను స్వరపరచడమే కాకుండా, తన గంభీరమైన గొంతుతో పాడారు. వినాశనాన్ని సూచించేలా సాగే ఈ పాటలో ఎమోషన్ పవర్ సమపాళ్లలో ఉన్నాయి. తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. “మనలో మనం జుదా… తబాహి” అంటూ సాగే పదాలు వినే కొద్దీ ఎక్కేలా ఉన్నాయి. ఈ పాటలో యష్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మెరిసింది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Read also- Allu Arjun: అల్లు శిరీష్ పెళ్లి కొడుకు ఫంక్షన్.. స్టైలిష్ లుక్ లో అల్లు అర్జున్.. బన్నీ డ్రెస్,వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా?

యష్, కియారా కెమిస్ట్రీ: పాటలో హైలైట్

పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్యాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో (తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం) ఈ పాటను విడుదల చేశారు. కేజీఎఫ్ తర్వాత యష్ రాబోతున్న సినిమా కావడంతో, ‘టాక్సిక్’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొత్తానికి ‘తబాహి’ సాంగ్‌తో ‘టాక్సిక్’ టీమ్ సరైన ఆరంభాన్ని ఇచ్చింది. యష్ తన స్టైలిష్ అండ్ మాస్ అప్పీల్‌తో మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే  ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ నాలుగు వందల మిలియన్లకు పైడా వ్యూస్  సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

పాన్ ఇండియా స్థాయిలో ‘తబాహి’: అంచనాలు పెంచేలా!

Read also- Vishnu Dubai: దుబాయ్‌లో చిక్కుకున్న తమ్ముడి కోసం ప్రార్థంచమంటున్న మంచు లక్ష్మి.. ఏమైఉంటుంది?

మొత్తానికి, ‘తబాహి’ పాటతో ‘టాక్సిక్’ చిత్రం ఒక మంచి ఆరంభం చేసింది. ఈ పాట సినిమాపై అంచనాలను పెంచేసింది. బాక్సాఫీస్ వద్ద యష్ తన సత్తా చాటుతాడని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.