
📌 Key Points
- యష్ ‘టాక్సిక్’ నుండి సుదేవ్ నాయర్ ఫస్ట్ లుక్ విడుదల.
- సుదేవ్ నాయర్ ‘కర్మడి’ పాత్రలో స్టైలిష్ విలన్‌గా కనిపించనున్నారు.
- సుదేవ్ నాయర్ గతంలో పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో నటించారు.
- ఈ సినిమా 2026 మార్చి 19న విడుదల కానుంది.
రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం నుంచి మలయాళ నటుడు సుదేవ్ నాయర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో సుదేవ్ ‘కర్మడి’ అనే విలన్ పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘టాక్సిక్’లో సుదేవ్ నాయర్ పాత్ర
Yash Toxic: రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) నటిస్తోన్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairy Tale For Grown Ups)కి సంబంధించి ఒక్కో కారెక్టర్, పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేస్తూ వదిలిన పోస్టర్లు ఎంతటి సంచలనాన్ని క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇందులో రాయ పాత్రలో యశ్ రక్తాన్ని ఏరులై పారించినట్టుగా ఇటీవల వచ్చిన టీజర్ తెలియజేసింది. ఈ సినిమాకు సంబంధించి వస్తోన్న ఒక్కో అప్డేట్, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూడాలా? అని వెయిట్ చేసేలా చేస్తున్నాయి. ఈ సినిమాను 2026, మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడటంతో.. రోజూ ఏదో విధంగా ఈ సినిమాను వార్తలలో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో యాక్టర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
‘టాక్సిక్’ నుంచి వచ్చిన తాజా పోస్టర్ ఎవరిదో కాదు.. తన విలక్షణమైన నటనతో విలన్‌గా దూసుకెళుతోన్న మలయాళ నటుడు సుదేవ్ నాయర్‌ది. ఇందులో సుదేవ్ నాయర్ (Sudev Nair) ‘కర్మడి’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా విడుదలైన పోస్టర్‌ని గమనిస్తే.. గన్ పేలుస్తూ ఇందులో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇందులో ఆయన స్టైలిష్ విలన్‌గా కనిపించనున్నారనే విషయాన్ని ఈ పోస్టర్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. సుదేవ్ నాయర్ విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే. అన్ని భాషల్లో ఆయన విలన్‌గా దూసుకెళుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాలో ఆయన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో కూడా ఆయనకు చాలా కీలక పాత్ర దక్కింది. ఆ పాత్రలో సుదేవ్ ఎంతగానో మెప్పించారు.
వైరల్ అవుతున్న సుదేవ్ నాయర్ ఫస్ట్ లుక్
ఇప్పుడు రాబోయే ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’లో తన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందని, ఈ సినిమా తర్వాత నేషనల్ వైడ్‌గా తన పేరు వైరల్ అవుతుందని చిత్రయూనిట్ సైతం చెబుతోంది. అంటే, ఇందులో సుదేవ్ నాయర్ పాత్ర ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కలిగిన సుదేవ్ నాయర్ కోసం అన్ని భాషల్లోని దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. యశ్, గీతూ మోహన్‌దాస్ సంయుక్తంగా రచించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో చిత్రీకరిస్తుండగా.. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం తదితర భాషల్లో డబ్ వెర్షన్లు విడుదల కానున్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Introducing Sudev Nair as KARMADI in – A Toxic Fairy Tale For Grown-Ups #Toxic In Cinemas Worldwide from 19-03-2026 #ToxicTheMovie #ToxicOnMarch19th @TheNameIsYash #Nayanthara @advani_kiara @humasqureshi @rukminitweets #TaraSutaria #GeetuMohandas @RaviBasrur @VishalMMishra … pic.twitter.com/uvT0Wr4WVK
సుదేవ్ నాయర్ గురించి కొన్ని విషయాలు
— KVN Productions (@KvnProductions) February 23, 2026
మొత్తానికి, సుదేవ్ నాయర్ ‘టాక్సిక్’ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆయన కెరీర్ ఈ సినిమాతో మరింత ముందుకు సాగుతుందని ఆశిద్దాం.


