
యువతను ఆకట్టుకునే యషిక ఆనంద్ ప్రధాన పాత్రలో ‘టాస్’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. మూడు హత్యల మిస్టరీ నేపథ్యంలో సగు పాండియన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దీని విడుదల తేదీపై అందరిలో ఆసక్తి నెలకొంది.
Key Points
యషిక ఆనంద్ ప్రధాన పాత్రలో 'టాస్' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.
సగు పాండియన్ దర్శకత్వంలో మూడు హత్యల మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
25 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లో లేదా 2026 ప్రథమార్థంలో విడుదల చేయాలని ప్రణాళిక.
ఈ చిత్రానికి శంతన్ అనిభజనే సంగీతం అందిస్తుండగా, ధర్మ దురై సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
‘టాస్’ మూవీ కథా నేపథ్యం
తనదైన అందాలతో యువతను ఆకట్టుకునే బ్యూటీ యషిక ఆనంద్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం టాస్. ఈ మూవీలో తేజస్విని మరో హీరోయిన్ గా నటిస్తోది . ఈ చిత్రంలో రత్నం మౌళి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సగు పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్రం షూటింగ్ ఇటీవల తమిళనాడులోని కోవెల్ పట్టిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.
షూటింగ్ వివరాలు, నటీనటులు
ఈ సందర్భంగా టాస్ దర్శకుడు మాట్లాడుతూ .. ‘ ఇది ఒక ప్రాంతంలో జరిగే 3 హత్యల నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఆ హత్యల నేపథ్యం ఏమిటి? వాటికి నటి యషిక ఆనంద్ కు ఉన్న సంబంధం ఏంటి అన్న అంశాలతో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథగా తెరకెక్కిస్తున్నాం . ఈ మూవీ షూటింగ్‌ను కోవెల్ పట్టి, బిరుదు నగర్, సాత్తూర్ ప్రాంతాల్లో నిర్వహించి 25 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో గాని 2026 ప్రథమార్ధంలో గాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ‘ చెప్పారు.
సినిమా విడుదల ఎప్పుడంటే?
ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మముందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రానికి శాంతన్ అనిభజనే సంగీతం అందిస్తుండగా .. ధర్మ దురై సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ టీవీ ఫేమ్ యోగి ,షన్న, సంజయ్ శంకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు . ఈ చిత్రాన్ని బ్లాక్ డైమండ్ స్టూడియో పతాకంపై సయ్యద్ జాఫర్ నిర్మిస్తున్నారు.
‘టాస్’ చిత్రం ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తించే క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకొని, ఈ ఏడాది చివర్లో లేదా 2026 ప్రథమార్థంలో విడుదల కానుంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.


