
📌 Key Points
- బీఆర్ నాయుడు వీడియోలను వైరల్ చేస్తున్న వైసీపీ
- టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్
- వైసీపీ పోస్ట్ చేసిన లేఖలో సంచలన ఆరోపణలు
- విషయమై క్లారిటీ రావాల్సి ఉందని తెలిపిన బీఆర్ నాయుడు
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చుట్టూ వివాదం రాజుకుంది. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం రాజకీయ దుమారానికి దారితీసింది.
బీఆర్ నాయుడుపై వైసీపీ ఆరోపణలు
రెండుమూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు పేరుతో వీడియో క్లిప్పింగ్స్‌పైనే రాజకీయ నడుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ఆ వీడియోలను ఎక్కువగా వైరల్ చేస్తోంది. అంతేకాదు ఆ పార్టీ ముఖ్యనేతలు సైతం ఈ విషయంపై మాట్లాడుతున్నారు. టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలు డీప్ ఫేక్ అని బీఆర్ నాయుడు క్లారిటీ ఇచ్చారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తో వీడియోలలో కనిపించిన మహిళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లకు వివరణాత్మక లేఖ రాసి, ఆయనతో తనకున్న అనుబంధం గురించి వివరించిందని వైఎస్సార్సీపీ తెలిపింది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేసింది.
వైరల్ అవుతున్న వీడియోలు, లేఖ
ఆ లేఖలో ఆమె 30 ఏళ్ల అనుబంధం గురించి మాట్లాడిందని, అది సంబంధంగా మారిందని, భావోద్వేగ వేధింపులు, అవమానం, ఆర్థిక ఇబ్బందులు, బెదిరింపులను ఎదుర్కొన్నారని వైసీపీ తెలిపింది. తన కుమార్తె తీవ్రమైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్నప్పుడు తాను తీవ్ర బాధను ఎదుర్కొన్నానని లేఖలో వెల్లడించింది. అలాంటి వ్యక్తికి టీటీడీ ఛైర్మన్ లాంటి ఉన్నత పదవి ఇవ్వకూడదని, అది గౌరవాన్ని దెబ్బతీస్తుందని లేఖలో రాశారు. వైసీపీ పోస్ట్ చేసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. బీఆర్ నాయుడు వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ ఎక్స్‌లో ట్రూత్ బాంబ్ పేరుతో పోస్ట్ చేసింది. అయితే ఈ లేఖపై క్లారిటీ రావాల్సి ఉంది. లేఖ గురించి బీఆర్ నాయుడు నుంచి ఏమైనా స్పందన వస్తుందో లేదో చూడాలి.
సోషల్ మీడియాలో టీటీడీ ఛైర్మన్ వీడియోలు, ఫొటోలు బహిర్గతమైన తర్వాత ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్‌ను వైసీపీ బలంగా వినిపిస్తోంది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. ఈ వీడియో, ఫోటోలను పరిశీలన కోసం పంపామన్నారు. చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని టీటీడీ ఉన్నత పదవిలో నియమించి ప్రతిష్టను, పవిత్రతను దిగజార్చారని వ్యాఖ్యానించారు.
రాజీనామా చేయాలని డిమాండ్
వైరల్ అయిన ఫొటోలను, వీడియోలను ప్రదర్శిస్తూ.. చిత్రాలలో కనిపించే మహిళ రాసిన లేఖను భూమన చదివారు. ఆ లేఖను చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడంతో ఆయన ఉద్దేశం స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు. సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయని, పవిత్రమైన పదవిలో ఆయన ఎందుకు కొనసాగాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారని భూమన తెలిపారు..
‘బీఆర్ నాయుడు మీడియా ప్రసంగంలో ధిక్కార స్వరంతో మాట్లాడారు. కానీ లేఖలో ఆయన పాత్ర, ఆ మహిళ కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా చెప్పారు. వారి సంబంధం, ఆ వ్యక్తి తనను ఎలా దోపిడీ చేశాడనే దాని గురించి స్పష్టంగా రాశారు. ఆయన పాత్రను పూర్తిగా బయటపెట్టడం వల్ల ఆయన టీటీడీ ఛైర్మన్ పదవిలో కొనసాగకూడదు.’ అని భూమన అన్నారు.
బీఆర్ నాయుడు వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ ఆరోపణలు, డిమాండ్లతో ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి. దీనిపై బీఆర్ నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.


