|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ye Oorikelthave Pilla Song: తెలుగు పాటకు విదేశీ జంట ఫిదా.. ఈ సాంగ్ చూశారా?

Published: 18-07-2025, 11:13 AM
Ye Oorikelthave Pilla Song: తెలుగు పాటకు విదేశీ జంట ఫిదా.. ఈ సాంగ్ చూశారా?

స్వీడన్‌కు చెందిన ఒక జంట ‘సీతా పయనం’ చిత్రంలోని ‘ఏ ఊరికెళ్తావే పిల్లా’ పాటకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఈ వీడియో తెలుగు సినిమాలకున్న ప్రపంచవ్యాప్త ఆదరణను చాటుతోంది.

Key Points

1

స్వీడన్ దేశస్థులు కర్ల్ స్వాన్‌బెర్గ్ మరియు ఆయన భార్య 'సీతా పయనం' చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేశారు.

2

'ఏ ఊరికెళ్తావే పిల్లా' పాటకు వారి నృత్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

4

తెలుగు సినిమాలకు విదేశీ అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

విదేశీ జంట యొక్క వైరల్ డ్యాన్స్ వీడియో

తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ వస్తోంది . మన టాలీవుడ్ చిత్రాలకు విదేశీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు . జపానీయులైతే మన చిత్రాలను తెగ చూసేస్తారు . జపాన్ ‌ కు చెందిన జూనియర్ ఎన్టీఆర్ ‌ అభిమాని తెలుగు కూడా నేర్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది . అంతలా మన సినిమాలకు ఫారినర్స్ ఫిదా ‍ అయిపోయారు . ఇక డేవిడ్ వార్నర్ గురించి చెప్పాల్సిన పనిలేదు . పుష్ప మేనరిజంతో రీల్స్ ‌ చేస్తూ అలరించిన డేవిడ్ ‌ వార్నర్ .. నితిన్ మూవీ రాబిన్ ‌ హుడ్ ‌ తో ఏకంగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు . అంతలా మన సినిమాలు , పాటలకు విదేశీ ఆడియన్స్ ‌ సైతం ఫిదా అయిపోవాల్సిందే .

‘సీతా పయనం’ చిత్రం నుండి ప్రసిద్ధ పాట

గతంలో సంక్రాంతి వస్తున్నాం సాంగ్ ‌ తో అలరించిన విదేశీ జంట .. మరోసారి తెలుగు పాటతో సోషల్ మీడియాను షేక్ చేసింది . తాజాగా ఈ జంట మరోసారి తెలుగు సాంగ్ ‌ తో ప్రేక్షకులను అలరించింది . స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్‌బెర్గ్‌ అనే నటుడు తన సతీమణితో కలిసి మరో తెలుగు పాటకు డ్యాన్స్ చేశారు.

తెలుగు సినిమాల ప్రపంచవ్యాప్త ఆకర్షణ

అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా , ఐశ్వర్య అర్జున్ ‌ హీరో , హీరోయిన్లుగా నటించిన చిత్రం సీతా పయనం . ఈ సినిమాలో ‘ ఏ ఊరికెళ్తావే పిల్లా .. నువ్వు ఏ ఊరికెళ్తావే పిల్లా .. మా ఊరు రావే పిల్లా ‘ అనే పాటను రీ క్రియేట్ చేశారు . తెలుగు వంటకాలను పరిచయం చేస్తూ విదేశీ జంట చేసిన వీడియో నెట్టింట వైరల్ ‌ గా మారింది . తెలుగు ఆడియన్స్ ‌ ను ఈ వీడియో తెగ ఆకట్టుకుంటోంది . కాగా .. అర్జున్‌ సర్జా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతా పయనం . అర్జున్‌ కుమార్తె, హీరోయిన్‌ ఐశ్వర్యా అర్జున్‌ మెయిన్‌ లీడ్‌ రోల్‌లో నటించింది . సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించారు .

తెలుగు సినిమా పాటలకు విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వీడియో ద్వారా తెలుగు సంస్కృతి ప్రపంచానికి చేరుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.