
బలగం వేణు దర్శకత్వంలో వస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రం నిర్మాణంలో జాప్యం ఎదుర్కొంటోంది. నాని, శర్వానంద్ స్థానంలో నితిన్ హీరోగా ఎంపికైనా, అతని వరుస పరాజయాలు మేకర్స్‌ను పునరాలోచింపజేస్తున్నాయి. ఈ ఆలస్యం సినిమాపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Key Points
బలగం వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' సినిమా రూపొందుతోంది.
నాని, శర్వానంద్ తర్వాత నితిన్ హీరోగా ఖరారైనప్పటికీ, అతని వరుస డిజాస్టర్లు మేకర్స్‌ను ఆలోచింపజేస్తున్నాయి.
ఈ సినిమా ప్రాజెక్టు రెండేళ్లుగా ఆలస్యమవుతోంది.
ఇంకా ఆలస్యం అయితే ప్రేక్షకులు విరక్తి చెందే అవకాశం ఉంది.
బలగం వేణుకు ‘ఎల్లమ్మ’ కష్టాలు
Yellamma: కొన్నిసార్లు ఆనుకొకుండా వచ్చే విజయం కూడా మనల్సి డైలమాలో పడేస్తుంది. తరువాత ఎం చేయాలన్నా వెనుకా ముందు ఆలోచించాల్సి వస్తుంది. ఆలస్యం అవుతుంది. కానీ, ఇవన్నీ అవతల వ్యక్తులకు తెలియదు కదా. ఆ ఆలోచనలు సెట్ అయ్యేలోపే జరగాల్సిన(Yellamma) నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు బలగం వేణు. బలగం సినిమాతో ఎమోషనల్ హిట్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయ్యేలా చేశాడు వేణు. సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాదు వేణుకు మంచి క్రేజ్ ను కూడా తెచ్చిపెట్టింది ఈ మూవీ.
Nithin: బ్యాడ్ టైం అన్నారు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ను సెట్ చేశాడు.. ఈసారి టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు
హీరోల మార్పు, నితిన్ ఆలోచన
అదే జోష్ లో తన నెక్స్ట్ సినిమా కోసం మరో ఎమోషనల్ కథను సిద్ధం చేసుకున్నాడు. అదే ఎల్లమ్మ. ఈ సినిమా కోసం నేచురల్ నానిని హీరోగా అనుకున్నాడు. అంతా సెట్ అయ్యింది ఇక షూటింగ్ మొదలవుతుంది అనుకునే టైంలో ఈ సినిమా నుంచి నాని తప్పుకున్నాడు. దానికి కారణాలు కూడా వేరే ఉన్నాయి. ఆ తరువాత ఈ ప్రాజెక్టులోకి మరో క్రేజీ హీరో శర్వానంద్ వచ్చాడు. ఆల్మోస్ట్ లాక్ అయ్యింది ప్రాజెక్టు కూడా.. కానీ ఎందుకు అక్కడ కూడా వర్కౌట్ అవలేదు. అప్పుడు నితిన్ తో మాట్లాడి ఒప్పించాడు నిర్మాత దిల్ రాజు.
‘ఎల్లమ్మ’ ఆలస్యం: నష్టం తప్పదా?
ఇక అప్పటినుంచి ఎల్లమ్మ సినిమాలో హీరో నితిన్ అని అందరు ఫిక్స్ అయ్యారు. రేపోమాపో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని నితిన్ కూడా చెప్పాడు. కానీ, నితిన్ నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్స్ అవుతుండటంతో మేకర్స్ మరోసారి ఆలోచనల్లో పడ్డారు. ఇదంతా రెండేళ్ల కథ. ఈ రెండేళ్లలో సినిమా షూట్ కూడా కంప్లీట్ అయ్యి రిలీజ్ కూడా అయ్యిండేది అన్ని పర్ఫెక్ట్ గా కుదిరి ఉంటే. ఇంకా ఆలస్యం అయితే, మొదటికే మోసం అయ్యే అవకాశం ఉంది. ఇలా ఏళ్ళ తరబడి సాగదీసిన సినిమాలపై ఆడియన్స్ లో విరక్తి వచ్చే అవకాశం ఉంది. కథలో మ్యాజిక్ ఉన్నప్పటికీ ఆలస్యం అయ్యింది అంటే ఆ ప్రాజెక్టు నెగ్లెక్ట్ చేస్తారు ఆడియన్స్ కాబట్టి, ఎల్లమ్మ విషయంలో మేకర్స్ ఎంత తొందరపడితే అంత మంచిది.
కాబట్టి, ‘ఎల్లమ్మ’ సినిమా విషయంలో మేకర్స్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి. మరింత ఆలస్యం చేస్తే ప్రాజెక్టు మొదటికే మోసం అయ్యే ప్రమాదం ఉంది. ప్రేక్షకులలో ఆసక్తి తగ్గకముందే సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం మంచిది.


