
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి తన తాజా ఫోటోషూట్‌లో ఎల్లో కలర్ డ్రెస్సులో అందంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Key Points
ఎల్లో డ్రెస్సులో అద్భుతంగా కనిపించిన మీనాక్షి చౌదరి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె ఫోటోలు.
నేటిజన్ల నుండి ఎన్నో ప్రశంసలు అందుకుంటున్న మీనాక్షి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత మీనాక్షి కెరీర్‌లో మరో మలుపు.
మీనాక్షి చౌదరి తాజా ఫోటోలు
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు.
సోషల్ మీడియాలో వైరల్
ప్రస్తుతం నాగ చైతన్య సరసన ఎన్‌సి-24 మూవీలో యాక్ట్ చేస్తుంది. అలాగే నవీన్ పొలిశెట్టితో ఇంకో సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మీనాక్షి చౌదరి తన సోషల్ మీడియా(Social Media)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో ఎల్లో కలర్ అవుట్ ఫిట్‌లో గ్లామరస్ ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తుంది. మోడ్రన్ డ్రెస్సులో మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఎల్లోరా శిల్పంరా తను అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నేటిజన్ల ప్రతిస్పందన
A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006)
మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనుసంధానం కొనసాగిస్తుంది. ఈ ఫోటోలతో ఆమె మరోసారి తన అందాన్ని ప్రదర్శించింది.


