
📌 Key Points
- కార్తీ, కృతి శెట్టి నటిస్తున్న ‘అన్నగారు వస్తారు’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా కృతి కామెంట్స్.
- ట్రోల్స్ భరించలేకపోయానని, నటన ఆపేద్దామనుకున్నానని కృతి శెట్టి వెల్లడి.
- ఒత్తిడి వల్ల జుట్టు రాలడం, చర్మ సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపిన యంగ్ హీరోయిన్.
- ‘ఉప్పెన’ సినిమాకు వచ్చిన ఆదరణే తనకు తిరిగి ఉత్సాహాన్నిచ్చిందని కృతి శెట్టి వ్యాఖ్యలు.
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తన కొత్త సినిమా ‘అన్నగారు వస్తారు’ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ట్రోల్స్ కారణంగా తాను ఎంతగానో బాధపడ్డానని, ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నానని భావోద్వేగంగా వెల్లడించింది. ‘ఉప్పెన’ విజయం తనకు తిరిగి ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొంది.
కృతి శెట్టి భావోద్వేగ వ్యాఖ్యలు
స్టార్ హీరో కార్తీ(Karthi), యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నగారు వస్తారు’(Annagaru Vastharu). ఈ చిత్రానికి నలన్ కుమార స్వామి(Nalan Kumarasamy) దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 12న తెలుగులో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామచేసిన ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
ట్రోల్స్ కారణంగా ఆరోగ్య సమస్యలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “నటనకి అపారమైన భావోద్వేగ శక్తి చాలా అవసరం. సినిమా కోసం అంతలా పని చేస్తున్నప్పుడు. ఎలాంటి కారణం లేకుండా ద్వేషాన్ని స్వీకరించడం భరించలేని విషయం. మన నియంత్రణలో లేని విషయాలపై కూడా విమర్శల్ని ఎదుర్కోవడం బాధ కలిగిస్తుంది. ఆ టైంలో వచ్చిన ట్రోల్స్ తీవ్రంగా బాధించాయి. ఒక దశలో నటన ఆపేద్దామని అనుకున్నా. నాకూ, నా తల్లిదండ్రులకీ సినిమా గురించి పెద్దగా తెలియదు.
ఉప్పెన విజయం.. కెరీర్‌కు స్ఫూర్తి
కాబట్టి, తీవ్రంగా ఒత్తిడికి గురయ్యాను. దాంతో జుట్టు రాలిపోవడం, చర్మ సమస్యలు ఎదుర్కొన్నాను. అవన్నీ చూసిన మా పేరెంట్స్ కష్టంగా ఉంటే చేయవద్దని అన్నారు. కానీ, ఉప్పెన సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ నాకు ఉత్సాహాన్నిచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది కృతి. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఉప్పెన తరువాత ఈ బ్యూటీ నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. దీంతో ఈ అమ్మడి పై సోషల్ మీడియాలో ఐరన్ లెగ్ అంటూ దారుణమైన ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే.
మొత్తంగా, కృతి శెట్టి ఎదుర్కొన్న మానసిక, శారీరక ఇబ్బందులు, వాటిని అధిగమించి ముందుకు సాగేందుకు ఆమె చూపిన ధైర్యం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘ఉప్పెన’ ఆదరణ ఆమెకు ఎంతగానో మద్దతునిచ్చిందని స్పష్టం.


