|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కడ మంచు వారి అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్

Published: 03-06-2025, 3:21 AM
అక్కడ మంచు వారి అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్

టాలీవుడ్ నటి నేహా శెట్టి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో ఆమె మంచు లక్ష్మితో ఇండోనేషియాలోని బాలీలో సెలవులు గడుపుతోంది.

Key Points

1

నేహా శెట్టి ఇండోనేషియాలో బాలీలో సెలవులు గడుపుతోంది.

2

మంచు లక్ష్మితో పాటు మరికొంత మంది స్నేహితులతో ఆమె సరదాగా గడుపుతోంది.

4

ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

నేహా శెట్టి యొక్క వైరల్ ఫోటోలు

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మెహబూబా’(Mehabooba) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డీజే టిల్లు’(DJ Tillu) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్‌లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో గత్తరలేపుతుంది.

ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా నేహా శెట్టి ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అందులో మంచు వారమ్మాయి మంచు లక్ష్మితో పాటు మరికొంత మంది గర్ల్స్‌తో ఇండోనేషియాలోని బాలీలో ఎంజాయ్ చేస్తున్న పిక్ను పంచుకుంది. ఇక దీనికి మంచి మెమోరీస్ క్రియేట్ చేసే నా మెయిన్ గర్ల్స్ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ స్టోరీ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇండోనేషియాలో సెలవులు

మంచు లక్ష్మితో సరదా

నేహా శెట్టి మరియు మంచు లక్ష్మితో కలిసి గడిపిన సెలవుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు నేహా శెట్టి యొక్క ప్రజాదరణను మరింత పెంచుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.