
📌 Key Points
- హవిష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఎంటర్టైనర్‌గా ‘నేను రెడీ’ మూవీ!
- త్రినాధ రావు నక్కిన మార్క్ కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫుల్ మీల్స్!
- మిక్కీ జె మేయర్ మ్యూజిక్.. సమ్మర్ హీట్‌కు చార్ట్ బస్టర్ ఆల్బమ్ రెడీ!
- బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌తో నవ్వులు పూయించే తారాగణం!
యంగ్ హీరో హవిష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన కాంబినేషన్‌లో వస్తున్న ‘నేను రెడీ’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని టాక్.
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నేను రెడీ’!
యంగ్ హీరో హవిష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కినతో కలసి చేస్తున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్, టీజర్ గ్లింప్స్‌తో ఇప్పటికే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇదే క్రేజ్‌తో తాజాగా మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుపుతూ.. క్లైమాక్స్ షూట్ సీన్స్ ఫొటోస్ ఫేర్ చేస్తూ సినిమా అద్భుతంగా వచ్చినట్లు తెలిపారు. ఈ సినిమా త్రినాధ రావు నక్కిన మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ‘నేను రెడీ’ ని సిద్ధం చేస్తున్నాట్లు చెప్పుకొచ్చారు. హీరో హవిష్ కెరీర్‌లో నేను రెడీ అద్భుతమైన ఎంటర్టైనింగ్ ఫిల్మ్‌గా ఉండబోతోదని తెలుస్తుండగా.. షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, జిటివి గణేష్, రోహిణి, హరితేజ వంటి ప్రముఖ తారాగణం ప్రేక్షకులకు నవ్వులు పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమా చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేయగా.. భారీ అంచనాల మధ్య వేసవిలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
సమ్మర్ లో రిలీజ్.. ఫ్యాన్స్ కి పండగే!
హాస్యానికి కేరాఫ్ అడ్రస్.. త్రినాధ రావు నక్కిన!
‘నేను రెడీ’ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


