|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూపర్ స్టార్ కి పెద్ద ఝలక్‌ ఇచ్చిన యంగ్‌ హీరోయిన్‌.. దుమ్ములేపుతున్న `కొత్త లోక` కలెక్షన్లు

Published: 04-09-2025, 12:03 AM
సూపర్ స్టార్ కి పెద్ద ఝలక్‌ ఇచ్చిన యంగ్‌ హీరోయిన్‌.. దుమ్ములేపుతున్న `కొత్త లోక` కలెక్షన్లు

మలయాళ సినిమా ‘కొత్త లోక’ బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది. కల్యాణి ప్రియదర్శన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళనాడులో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Key Points

1

కొత్త లోక సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది.

2

తమిళనాడులో 4 రోజుల్లో రూ. 3.85 కోట్లు వసూలు చేసింది.

4

తెలుగులో ఐదు రోజుల్లో రూ.5 కోట్లు వసూలు చేసింది.

కొత్త లోక సినిమా విజయం

మలయాళ చిత్రాలు ఇప్పుడు అన్ని ఇతర భాషా చిత్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అదే సమయంలో బాక్సాఫీసు వద్ద సంచలనాలు క్రియేట్‌ చేస్తున్నాయి. ఇతర సినిమాలకు పెద్ద షాక్‌ ఇస్తున్నాయి. `మంజుమ్మల్ బాయ్స్`, `ప్రేమమ్` వంటి సినిమాలకు లభించిన ఆదరణ దీనికి నిదర్శనం. ఇప్పుడు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది `కొత్త లోక`(లోక: చాప్టర్ 1 చంద్ర). ఈ మూవీ మలయాళ ప్రేక్షకులను మించి, ఇతర భాషా ప్రేక్షకులను కూడా  ఆకట్టుకుంటుంది. ఇది `కూలీ`కి షాక్‌ ఇవ్వడం విశేషం.

సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. నజ్రియా, చందు, సలీం కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించగా,  ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం, వసూళ్లలోనూ సత్తా చాటుతోంది. కొత్తగా విడుదలైన చిత్రాలన్నింటినీ `కొత్త లోక` చిత్రం వెనక్కి నెట్టేసింది.

బాక్సాఫీస్ వసూళ్లు

తమిళంలో `కొత్త లోక` చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇది విడుదలైన నాలుగు రోజుల్లో రూ.3.85 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ  రూ.100 కోట్లకు చేరువవుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెంచరీ కొట్టేస్తుందని అంచనా. అయితే `ప్రేమమ్`, `మంజుమ్మల్ బాయ్స్` చిత్రాల తర్వాత  కోలీవుడ్‌లో ఇంతటి ఆదరణ పొందుతున్న చిత్రం `కొత్త లోక` కావడం విశేషం.  ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణతో, దీనికి అధిక సంఖ్యలో థియేటర్లు కేటాయిస్తున్నారు.

రజనీకాంత్ కూలీతో పోటీ

తమిళనాట ప్రస్తుతం చాలా థియేటర్లలో రజనీకాంత్ `కూలీ` చిత్రమే ప్రదర్శితమవుతోంది. కానీ  `కొత్త లోక` ఫస్ట్ డే కేవలం రూ.86 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మంగళవారం రూ.90 లక్షలకు పైగా వసూళ్లు రాబట్టింది. వీక్ డేస్లో ఇతర భాషా చిత్రానికి ఇంతటి ఆదరణ లభించడం అరుదైన విషయంగా చెప్పొచ్చు. ఇది నెమ్మదిగా రజనీకాంత్ `కూలీ`ని దెబ్బ కొడుతూ క్రమంగా పుంజుకోవడం విశేషం.  ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఈ చిత్రం కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం విశేషం. `కొత్త లోక` తెలుగులోనూ మంచి ఆదరణ పొందుతుంది. తెలుగులో ఇది ఐదు రోజుల్లో రూ.5కోట్లు రాబట్టడం విశేషం.

చిన్న బడ్జెట్‌తో నిర్మించిన `కొత్త లోక` సినిమా అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమా భవిష్యత్తులో మరింత వసూళ్లు సాధిస్తుందని అంచనా.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.