|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యంగ్‌ హీరోయిన్‌ ప్రేమలో ‘అర్జున్‌ దాస్‌’ !

Published: 24-08-2025, 8:13 AM
యంగ్‌ హీరోయిన్‌ ప్రేమలో 'అర్జున్‌ దాస్‌' !

కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ ప్రేమలో పడ్డారనే వార్తలు తమిళ మీడియాలో వైరల్ గా వ్యాపిస్తున్నాయి. యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో ఆయన ప్రేమలో ఉన్నారని చెబుతున్నారు. వారిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Key Points

1

కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ ప్రేమ వార్తలు వైరల్

2

యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో ప్రేమ వ్యవహారం?

4

వారిద్దరూ వెబ్ సిరీస్ లో కలిసి పనిచేస్తున్నారు

అర్జున్ దాస్ ప్రేమ వ్యవహారం వైరల్

కోలీవుడ్‌ నటుడు అర్జున్‌ దాస్‌ ప్రేమలో పడ్డాడు. ఈమేరకు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఖైదీ సినిమాలో విలన్‌గా నటించిన అర్జున్‌ దాస్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఓజీ సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఒక యంగ్‌ హీరోయిన్‌తో అర్జున్‌ దాస్‌ ప్రేమలో ఉన్నారని నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఐశ్వర్య లక్ష్మితో ప్రేమ వార్తలు

2017లో వచ్చిన ‘ఆక్సిజన్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అర్జున్‌ దాస్‌.. మాస్టర్, విక్రమ్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్నారు.  అయితే, యంగ్‌ హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi)తో  ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఒక వెబ్‌ సిరీస్‌ కోసం పనిచేస్తుండగా ఈ  ప్రచారం జరుగుతుంది. కానీ, అర్జున్‌ దాస్‌ ఖండించారు. ఆపై ఐశ్వర్య లక్ష్మి కూడా తామిద్దరం మంచి స్నేహితులమంటూ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు.

నటుల వివరణ

కొందరు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదంటూనే వారి ప్రేమ నిజమేనంటూ చెప్పుకొస్తున్నారు. సరైన సమయం చూసి ప్రేమ గురించి అందరికీ తెలుపుతారంటూ పేర్కొంటున్నారు.   బ్యాంకు ఉద్యోగిగా, రేడియో జాకీగా అర్జున్‌ దాస్‌ పనిచేయగా.. ఐశ్వర్య లక్ష్మి  వైద్య విద్య పూర్తి చేశారు. ఐశ్వర్య లక్ష్మి తెలుగులో సత్యదేవ్‌తో గాడ్సే మూవీలో నటించారు. ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’లో  సాయిధరమ్‌ తేజ్‌తో నటిస్తున్నారు. మట్టి కుస్తీ, కింగ్ ఆఫ్ కొత్త,పొన్నియిన్ సెల్వన్,థగ్ లైఫ్ వంటి భారీ చిత్రాల్లో ఆమె మెప్పించారు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు.

ప్రస్తుతం వారిద్దరూ వార్తలను ఖండించినప్పటికీ, ప్రేమ వార్తలు ఇంకా వైరల్ గా ఉన్నాయి. భవిష్యత్తులో వారు తమ సంబంధం గురించి స్పష్టతనిస్తారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.