|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండస్ట్రీని వదిలేస్తున్న కుర్ర హీరోయిన్ కోమలి ప్రసాద్.. చెంప చెల్లుమనిపించే పోస్ట్‌తో వారికి సమాధానం

Published: 02-07-2025, 5:21 AM
ఇండస్ట్రీని వదిలేస్తున్న కుర్ర హీరోయిన్ కోమలి ప్రసాద్.. చెంప చెల్లుమనిపించే పోస్ట్‌తో వారికి సమాధానం

తెలుగు సినీ పరిశ్రమలో యువ నటి కోమలి ప్రసాద్ తన నటనా ప్రస్థానంపై కీలక ప్రకటన చేశారు. ఇండస్ట్రీని వీడుతున్నారనే వార్తలను ఖండించి, తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. ఆమె పోస్ట్‌తో అనేక అనుమానాలకు చుక్కీ పడింది.

Key Points

1

కోమలి ప్రసాద్ ఇండస్ట్రీని వీడుతుందనే వార్తలను ఖండించారు.

2

డాక్టర్ అయినా సరే, నటన కెరీర్‌ను కొనసాగిస్తానని ప్రకటించారు.

4

త్వరలోనే కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు.

కోమలి ప్రసాద్ తన నిర్ణయంపై స్పష్టత

యూనిక్ కంటెంట్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్న కోమలి ప్రసాద్.. హీరోయిన్‌గా, సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా మంచి పేరు సంపాదించుకుంది. త్వరలోనే శశివదనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే డాక్టర్ అయిన ఆమె ఇండస్ట్రీని వదిలిపోతుందని.. యాక్టింగ్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో ఆమె క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టింది.

‘అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అయ్యానంటూ అసత్య ప్రచారాలు, తప్పుదోవ పట్టించే వార్తల్ని ప్రచురిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ రూమర్లను నిజం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అందరికీ స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎంతో కష్టపడి ఇప్పటి వరకు సినిమాల్లో కెరీర్‌ను కొనసాగిస్తూ ఈ స్థాయి వరకు వచ్చాను. ఆ శివుని ఆశీస్సులతో నా కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాను.

తప్పుడు వార్తలపై ఆమె ఆగ్రహం

నాలో, నా శ్రేయోభిలాషులలో అనవసరమైన ఆందోళనలను రేకెత్తించేలా ఈ రూమర్లను ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చెందకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ స్పష్టతనిస్తూ పోస్ట్ వేస్తున్నాను. ఆ విధే నన్ను ఈ మార్గంలోకి తీసుకు వచ్చిందని నేను భావిస్తుంటాను. చివరి శ్వాస వరకు నటిగా నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నా వెన్నెంటే ఉన్న నా శ్రేయోభిలాషులందరికీ, నా కంటే నన్ను ఎక్కువగా నమ్మిన వారందరికీ ధన్యవాదాలు. నేను ప్రస్తుతం నా స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాను. త్వరలో కొత్త ప్రకటనలతో మీ అందరినీ చాలా గర్వపడేలా చేస్తాను’ అని కోమలి ప్రసాద్ అన్నారు.

భవిష్యత్ ప్రాజెక్టులపై సూచన

A post shared by Komalee Prasad (@komaleeprasad)

కోమలి ప్రసాద్ తన నటనా ప్రస్థానం కొనసాగుతుందని స్పష్టం చేసి, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టారు. త్వరలోనే కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.