|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘రాజా సాబ్’ ట్రైలర్‌పై యంగ్ హీరో సంచలన ట్వీట్: ‘కుమ్మి పడేశారు ప్రభాస్ అన్నయ్య’!

Published: 30-12-2025, 6:51 AM
ప్రభాస్ 'రాజా సాబ్' ట్రైలర్‌పై యంగ్ హీరో సంచలన ట్వీట్: 'కుమ్మి పడేశారు ప్రభాస్ అన్నయ్య'!
  • ప్రభాస్ ‘ది రాజా సాబ్’ హారర్ కామెడీ చిత్రం జనవరి 9న విడుదల కానుంది.
  • సినిమా రెండవ ట్రైలర్‌పై నవీన్ పొలిశెట్టి ‘కుమ్మి పడేశారు ప్రభాస్ అన్నయ్య’ అంటూ ట్వీట్ చేశారు.
  • పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
  • సంక్రాంతికి నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ మూవీ కూడా రిలీజ్ అవుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం జనవరి 9న రాబోతోంది. తాజాగా విడుదలైన రెండవ ట్రైలర్‌పై టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రభాస్ అన్నయ్య అంటూ పొగడటంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

రాజా సాబ్: హారర్ కామెడీ విత్ సాలిడ్ బజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించారు మేకర్స్.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈక్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ నిన్న రాజాసాబ్ నుంచి సెకెండ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్‌పై టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. ‘మన ట్రైలర్ వచ్చింది డార్లింగ్స్.

నవీన్ పొలిశెట్టి ట్వీట్ వైరల్

కుమ్మి పడేసారు ప్రభాస్ అన్నయ్య.. సంక్రాంతికి అతని ఈ అవతార్ చూడటానికి వేచి ఉండలేరు. ఆల్ ది బెస్ట్ టు దర్శకుడు మారుతి అన్నయ్య. మొత్తం టీమ్ యొక్క కృషి అన్ని ప్రతిఫలాలను తీసుకురావాలి. #RajaSaabని ఆస్వాదిద్దాం’ అంటూ రాసుకొస్తూ ట్రైటర్‌ను ట్యాగ్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. కాగా నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ మూవీ కూడా సంక్రాతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

సంక్రాంతి రేసులో ‘అనగనగా ఒక రాజు’

ప్రభాస్, పవన్‌ల నిజ స్వరూపం బయటపెట్టిన సుమ.. షాకింగ్ విషయాలు రివీల్ !

నవీన్ పొలిశెట్టి ట్వీట్‌తో ‘ది రాజా సాబ్’పై అంచనాలు మరింత పెరిగాయి. సంక్రాంతికి ప్రభాస్ ఈ కొత్త అవతార్ ఎలా ఉండబోతోందో చూడాలి. నవీన్ ‘అనగనగా ఒక రాజు’ కూడా ఇదే సమయంలో రిలీజ్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.