|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మరో కొత్త ప్రాజెక్ట్‌తో వచ్చేస్తున్న యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్..

Published: 15-11-2025, 8:45 AM
మరో కొత్త ప్రాజెక్ట్‌తో వచ్చేస్తున్న యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్..

‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్స్’ సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

Key Points

1

యంగ్ హీరో సంగీత్ శోభన్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

2

ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్న ఈ చిత్రం.

4

సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

సంగీత్ శోభన్ కొత్త సినిమా ప్రారంభం

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్‌తో యూత్ ఆడియెన్స్‌లో తనకుంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్. తాజాగా ఈయన మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ఇటీవల ఈ గర్ల్ ఫ్రెండ్‌తో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని, టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబోలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్ అందజేయగా, నిర్మాత ఎస్ కేఎన్ ఫస్ట్ క్లాప్ ఇచ్చి మూవీ టీమ్‌కు తమ బెస్ట్ విషెస్ అందించారు. ఓ సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.3 గా ఈ సినిమా నిర్మాణం కానుంది. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో

ట్రెండీ లవ్ స్టోరీతో వస్తున్న చిత్రం

ఓ సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీతో ఈ సినిమా రూపొందనుంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కానుంది. త్వరలో మరిన్ని వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.