
📌 Key Points
- యూట్యూబ్ మానిటైజేషన్ విధానంలో మార్పులు, క్రియేటర్లకు ఆదాయ మార్గాలు సులభతరం
- 500 సబ్‌స్క్రైబర్లు, 3000 గంటల వాచ్ టైంతో మానిటైజేషన్ ప్రారంభించే అవకాశం
- కాపీ కంటెంట్, AI కంటెంట్‌కు యూట్యూబ్ ఆదాయం నిలిపివేత
- AI కంటెంట్ వాడినట్టు వెల్లడిస్తేనే వీడియోకు అనుమతి
యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త తెలిపింది. మానిటైజేషన్ నిబంధనలను సడలించడంతో పాటు కంటెంట్ నాణ్యతను పెంచేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీని ద్వారా క్రియేటర్లు త్వరగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది.
కొత్త మానిటైజేషన్ విధానం: క్రియేటర్లకు లాభం?
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ తన కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. అలాగే తన ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ నాణ్యతను పెంచడానికి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఈ కొత్త నియమాల ప్రకారం యూట్యూబ్ మానిటైజేషన్‌ను రెండు దశలుగా విభజించింది, దీనివల్ల కొత్తగా ఛానెల్ మొదలుపెట్టిన వారు కూడా త్వరగా ఆదాయం పొందే అవకాశం ఉంది. మొదటి దశలో ఛానెల్‌కు 500 సబ్‌స్క్రైబర్లు, 3,000 గంటల వాచ్ టైమ్ లేదా 30 లక్షల షార్ట్స్ వ్యూస్ ఉంటే.. సూపర్ థాంక్స్, ఛానెల్ మెంబర్‌షిప్స్, షాపింగ్ ఫీచర్ల ద్వారా నేరుగా డబ్బులు పొందవచ్చు. అయితే వీడియోల మధ్యలో వచ్చే ప్రకటనల (Ads) ద్వారా పూర్తిస్థాయిలో సంపాదించాలంటే మాత్రం పాత నిబంధనల ప్రకారమే 1,000 సబ్‌స్క్రైబర్లు, 4,000 గంటల వాచ్ టైమ్ లేదా కోటి షార్ట్స్ వ్యూస్ కచ్చితంగా ఉండాలి.
ఈ మార్పుల్లో అత్యంత ముఖ్యమైనది “ఇనాథెంటిక్ కంటెంట్” (Inauthentic Content) అనే కొత్త రూల్. దీని ప్రకారం, వేరే వాళ్ల వీడియోలను కాపీ చేసి పెట్టడం, కేవలం AI టూల్స్ ఉపయోగించి బొమ్మలతో వీడియోలు చేసి పంపడం వంటి వాటికి యూట్యూబ్ ఇకపై రూపాయి కూడా ఇవ్వదు. ఒక వీడియో మానిటైజ్ అవ్వాలంటే అందులో క్రియేటర్ యొక్క సొంత సృజనాత్మకత, వాయిస్ ఓవర్, విశ్లేషణ స్పష్టంగా ఉండాలి. అంటే వేరే సమాచారాన్ని వాడుకున్నా దానికి మీ సొంత తెలివితేటలను జోడించి ఒక కొత్త రూపం ఇస్తేనే అది అసలైన వీడియోగా పరిగణించబడుతుంది. అలాగే మీరు వీడియోలో AIని ఉపయోగించి ఏదైనా దృశ్యాన్ని లేదా వాయిస్‌ను సృష్టించినట్లయితే, అది AI ద్వారా తయారు చేయబడిందని ప్రేక్షకులకు ముందే చెప్పాలి (Disclosure). ఒకవేళ ఈ విషయాన్ని దాచిపెట్టి ప్రేక్షకులను మోసం చేస్తున్నట్లు గుర్తిస్తే, యూట్యూబ్ ఆ వీడియోను తీసేయడమే కాకుండా మీ ఛానెల్‌పై కఠిన చర్యలు తీసుకుంటుందని యూట్యూబ్ పేర్కొంది.
AI కంటెంట్‌పై యూట్యూబ్ కొరడా.. రూల్స్ మారాయి!
డబ్బు సంపాదించడానికి సులువైన మార్గాలు
యూట్యూబ్ తీసుకువచ్చిన ఈ కొత్త మార్పులు కంటెంట్ క్రియేటర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. ముఖ్యంగా చిన్న క్రియేటర్లకు ఇది ఒక గొప్ప అవకాశం. అయితే నిబంధనలను పాటించకపోతే చర్యలు తప్పవు.


