
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి ముందు, యూట్యూబ్ సెన్సేషన్ నాగ దుర్గ షోలో పాల్గొనడం లేదని ప్రకటించింది. ఆమె ఫోక్ డ్యాన్స్ వీడియోలు విశేష ఆదరణ పొందాయి.
Key Points
యూట్యూబ్ సెన్సేషన్ నాగ దుర్గ బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదు.
ఆమె బిగ్ బాస్ షోపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
నాగ దుర్గ ఫోక్ డ్యాన్స్‌తో యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
ఆమె నృత్యంలో పీహెచ్‌డీ పూర్తి చేశాకే సినిమాలు చేస్తానని చెప్పింది.
నాగ దుర్గ బిగ్ బాస్‌ను తిరస్కరించింది
తెలుగు ఆడియన్స్ ను మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు వచ్చేస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి రేపే (సెప్టెంబర్ 7) తెరలేవనుంది. మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్ గా ఈ మెగా రియాలిటీ షో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రీమియర్ కానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్లపై బజ్ నెలకొంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఓ లిస్ట్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో రీతూ వర్మ తదితరుల పేర్లున్నాయి. అయితే ఇదే లిస్ట్ లో యూట్యూబ్ సెన్సేషనల్ ఫోక్ సింగర్ నాగ దుర్గ పేరు కూడా ఉంది. దీంతో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ఖాయమనిపించింది. కానీ నాగ దుర్గ సడెన్ షాక్ ఇచ్చింది.
యూట్యూబ్ సెన్సేషన్‌గా నాగ దుర్గ
డ్యాన్స్ తో పాటు అందంతోనూ అదరగొట్టే ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ సడెన్ షాక్ ఇచ్చింది. రేపు బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ స్టార్ట్ అవుతుండగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీతో ఆశ్చర్యపరిచింది. బిగ్ బాస్ షోపై ఇంట్రెస్ట్ లేదని కుండ బద్దలు కొట్టింది.
‘‘ఇంపార్టెంట్.. గాయ్స్ దీన్ని పెద్ద విషయంగా మార్చకండి. మిమ్మల్ని మరింతగా వెయిట్ చేయించాలని అనుకోవడం లేదు. బిగ్ బాస్ 9పై నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇందులో నేను పాల్గొనడం లేదు. నేను బిగ్ బాస్ వెళ్లడం లేదు. రూమర్లను ఎంకరేజ్ చేయకండి. త్వరలోనే పెద్ద అప్ డేట్స్ ఇస్తా’’ అని స్టోరీలో పోస్టు చేసింది నాగ.
నాగ దుర్గ భవిష్యత్ ప్రణాళికలు
తెలంగాణ ప్రజలకు నాగ దుర్గ అంటే పరిచయం అవసరం లేని పేరు. ఫోక్ సాంగ్స్ కు డ్యాన్స్ తో ఆమె తెగ పాపులర్ అయింది. ఆమె డ్యాన్స్ చేసిన వీడియోలు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతున్నాయి. ‘ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి’, ‘దారిపొంటత్తుండు’, ‘నా పేరే ఎల్లమ్మ’ తదితర పాటలతో యూట్యూబ్ ను షేక్ చేస్తూనే ఉంది.
నాగ దుర్గ చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకుంది. పద్నాలుగేళ్ల వయసులో పేరిణి నాట్యం కూడా నేర్చుకుండి. నల్గొండలో నృత్యాలయం కూడా స్థాపించింది. యూట్యూబ్ లో ఆమె డ్యాన్స్, అందం చూసి సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ నాట్యంలో పీహెచ్ డీ కంప్లీట్ చేశాకే సినిమాలు చేస్తానంటోంది ఈ బ్యూటీ. కలివి వనం అనే చిత్రంలో మాత్రం యాక్ట్ చేసింది.
నాగ దుర్గ తన నిర్ణయంతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. బిగ్ బాస్ కాకుండా తన నృత్యం, సినిమా ప్రయాణంపై దృష్టి పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది.


