|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: యూట్యూబర్ అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా బ్యాన్! మెటా సంచలన నిర్ణయం!

Published: 19-02-2026, 9:35 PM
షాకింగ్: యూట్యూబర్ అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా బ్యాన్! మెటా సంచలన నిర్ణయం!
  • యూట్యూబర్ అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాపై మెటా బ్యాన్ విధించడంతో ఒక్కసారిగా కలకలం!
  • భారతదేశం, హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలే దీనికి కారణం
  • అన్వేష్ పై నమోదైన కేసులను సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు!
  • మెటా సంస్థకు పోలీసులు విజ్ఞప్తి చేయడంతో తక్షణమే స్పందించిన యాజమాన్యం.

ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ కు ఊహించని షాక్ తగిలింది. అతనికి సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను మెటా బ్యాన్ చేసింది. దీనికి గల కారణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

అన్వేష్ ఖాతా బ్యాన్ వెనుక అసలు కారణం ఇదేనా?

Naa Anveshana: ప్రముఖ యూట్యూబర్, ట్రావెలర్ నా అన్వేష్ కి మెటా షాక్ ఇచినిది. అతనికి సంబందించిన ఇన్ స్టా గ్రామ్ పై బ్యాన్ విధించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ యాత్రికుడిగా నా అన్వేష్(Naa Anveshana) కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే.

కానీ, ఈమధ్య కాలంలో భారత దేశంపై, హిందూ దేవుళ్లపై అతను చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వివాదంపై అతనిపై పలు స్టేషన్ లలో కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ పోలీస్ లు నా అన్వేష్ పై వచ్చిన కేసులను సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు నా అన్వేష్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు రిక్వెట్ పెట్టారు. దానిపై స్పందించిన మెటా ఇప్పుడు నా అన్వేష్ ఇన్ స్టా గ్రామ్ పై బ్యాన్ విధించింది.

పోలీసుల రిక్వెస్ట్ తో మెటా సంచలన నిర్ణయం!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయం!

నా అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ బ్యాన్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం. అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.