|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యుగాలకైనా నా దానివై నీవే ఉంటావు.. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న యాభై ఏళ్ల నాటి పాట, ఇక్కడ చూసేయండి

Published: 29-08-2025, 3:50 AM
యుగాలకైనా నా దానివై నీవే ఉంటావు.. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న యాభై ఏళ్ల నాటి పాట, ఇక్కడ చూసేయండి

1975లో విడుదలైన ‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమాలోని ఒక పాత పాట ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ‘యుగాలకైనా నా దానివై నీవే ఉంటావు’ అనే ఈ పాట యూట్యూబ్ రీల్స్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ పాటకు నవతరం యువత ఆకర్షితులవుతున్నారు.

Key Points

1

50 ఏళ్ల నాటి పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.

2

‘అన్నదమ్ముల అనుబంధం’ సినిమా పాట ‘యుగాలకైనా నా దానివై’ ట్రెండింగ్‌లో ఉంది.

4

తెలుగు సినీ సంగీత ప్రియులను మళ్ళీ ఆకట్టుకుంటోంది ఈ పాత పాట.

యాభై ఏళ్ల నాటి పాట వైరల్

ఎప్పుడు ఏ పాట ఎవరికీ నచ్చుతుందో.. ఎప్పుడు వైరల్ అవుతుందో.. చెప్పడం కష్టం. ఇప్పుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ‘యుగాలకైనా నా దానివై నీవే ఉంటావు’ అంటూ ఒక పాట చాలా వైరల్ అవుతోంది. ఈ పాట మీద రీల్స్ చేసేందుకు ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. అయితే ఆ పాట వివరాలు మాత్రం చాలామందికి తెలియదు. నిజానికి ఇది చాలా పాత పాట. జనరేషన్ జెడ్ యువతకే కాదు… ఎనభైలలో పుట్టిన వారికి కూడా ఈ పాట గురించి తెలియకపోవచ్చు. దాదాపు 50 ఏళ్ల క్రితం నాటి పాట.. ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మీలో ఎంతోమంది రీల్స్ చేసిన ‘యుగాలకైనా నా దానివై నీవే ఉంటావు’0 అనే పాట అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలోది. ఇది 1975లో విడుదలైంది.

ఈ పాటపై వచ్చి షార్ట్స్ ఇక్కడ క్లిక్ చేసి చూసేయండి.

అన్నదమ్ముల అనుబంధం సినిమా హిట్ సాంగ్

అన్నదమ్ముల అనుబంధం సినిమాలో నందమూరి తారక రామారావు, మురళి మోహన్, నందమూరి బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమాలో మరొక హిట్ సాంగ్ కూడా ఉంది. అదే ‘ఆనాటి హృదయాల ఆనంద గీతం’ అనే పాట. ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఇందులోని పాటలను తెలుగు సంగీత ప్రపంచం మరిచిపోలేదు. అందులో మరొక శ్రావ్యమైన పాట ‘గులాబీ పువ్వై నవ్వాలి వయసు’ అనే పాట.

గులాబీ పువ్వై నవ్వాలి వయసు… అనే పాటను సుశీల, బాలసుబ్రమణ్యం అప్పట్లో ఆలపించారు. ఇప్పుడు ఇదే పాట యూట్యూబ్లో ట్రెండింగ్ గా మారింది. ఈ పాటలోని చరణం ‘మరీ మరీ నీ అందానికి సలాము చేశాను…’ అని మొదలవుతుంది. ఆ చరణంలోనే ఒకచోట ‘యుగాలకైనా నా దానివై నీవే ఉంటావు.. అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను’ అని వస్తుంది. లేటెస్ట్ గా ఈ చరణం ట్రెండింగ్ గా మారింది. దీనిపై ఎన్నో రీల్స్ చేస్తున్నారు జనరేషన్ జెడ్. అన్నీ కూడా లక్షలాది వ్యూస్ ను సంపాదించుకుంటున్నాయి. మీరు యూట్యూబ్లోకి వెళ్లి చూస్తే చాలు… ఈ పాటతో ఎన్నో రీల్స్ కనిపిస్తాయి.‘ మరీ మరీ నీ అందానికీ’ అని టైప్ చేసినా.. ‘యుగాలకైనా నా దానివై’ అని టైప్ చేసిన వేల కొద్ది రీల్స్ వచ్చి పడుతున్నాయి. అంతగా ఈ పాట నవతరానికి నచ్చేసింది.

యూట్యూబ్ రీల్స్‌లో ట్రెండింగ్

మీకు పాత పాట వెర్షన్ వినాలని ఉంటే ఇక్కడ మేము యూట్యూబ్ లింక్ ని ఇచ్చాము. దీంట్లో మీరు పాట వీడియోను చూడవచ్చు. అలాగే కొత్త పాటను కూడా మరొక వీడియోలో చూడవచ్చు.

తెలుగు సినిమా పాటలకు ఎప్పటికీ తగ్గని ఆదరణ ఉందని ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. ‘యుగాలకైనా నా దానివై’ పాట యూట్యూబ్ ట్రెండ్ ద్వారా తన మధుర గీతాలను తదుపరి తరాలకు అందిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.