|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాల గాయకులకు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప సీజన్​ 17 ఆడిషన్స్​.. హైదరాబాద్‌లోనే.. ఏ వయసు పిల్లలు పాల్గొనాలంటే?

Published: 31-07-2025, 12:18 PM
బాల గాయకులకు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప సీజన్​ 17 ఆడిషన్స్​.. హైదరాబాద్‌లోనే.. ఏ వయసు పిల్లలు పాల్గొనాలంటే?

ప్రతిభావంతులైన బాల గాయకుల కోసం జీ తెలుగు సరిగమప లిటిల్ ఛాంప్స్ సీజన్ 17 ఆడిషన్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ ఆడిషన్స్ లో పాల్గొనేందుకు 4 నుండి 14 ఏళ్ల పిల్లలు అర్హులు.

Key Points

1

జీ తెలుగు సరిగమప లిటిల్ ఛాంప్స్ సీజన్ 17 ఆడిషన్స్ హైదరాబాద్ లో!

2

4 నుండి 14 ఏళ్ల బాల గాయకులకు అద్భుతమైన అవకాశం!

4

శ్రీ సారథి స్టూడియోస్, అమీర్ పేట్ లో ఆడిషన్స్ జరుగుతాయి.

జీ తెలుగు సరిగమప లిటిల్ ఛాంప్స్ సీజన్ 17

తెలుగు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్​ జీ తెలుగు. ఫిక్షన్​, నాన్-ఫిక్షన్​ షోలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలతో​ వినోదం అందిస్తూనే​ ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

జీ తెలుగు సరిగమప కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ​విజయవంతంగా 16 సీజన్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు సరిగమప, 17వ సీజన్ ‘సరిగమప లిటిల్​ ఛాంప్స్​​’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

హైదరాబాద్ ఆడిషన్స్ వివరాలు

‘సరిగమప సీజన్‌ 17​​’​ను ఘనంగా ప్రారంభించేదుకు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఆడిషన్స్​ నిర్వహిస్తూ బాల గాయనీ గాయకులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు జీ తెలుగు సువర్ణావకాశాన్ని అందిస్తోంది. జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్​ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఆడిషన్స్​ నిర్వహిస్తోంది.

ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ ఆదివారం (ఆగస్ట్ 3) హైదరాబాద్‌లో ఆడిషన్స్​ నిర్వహిస్తోంది. సరిగమప సీజన్​ 17 ఆడిషన్స్​ హైదరాబాద్​‌ అమీర్ పేట్‌లోని శ్రీ సారథి స్టూడియోస్​ నందు ఆగస్టు 3 ఆదివారం రోజున ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి.

పాల్గొనేందుకు అర్హత

4 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలు ఈ ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చు. ఆసక్తి గలవారు జీ తెలుగు అందిస్తున్న ఈ గోల్డెన్​ ఛాన్స్‌​ని మిస్​ కావద్దు అని నిర్వహాకులు ప్రకటించారు. ఈ ఆడిషన్స్ వివరాల కోసం మొబైల్ నెంబర్ 9154145100 ​పై సంప్రదించవచ్చు అని ప్రకటనలో తెలిపారు.

మీ చిన్నారులు గాయనీ గాయకులుగా మారే ఆ సువర్ణవకాశాన్ని ఆలస్యం చేయకుండా జీ తెలుగు సరిగమప ఆడిషన్స్‌​లో పాల్గొనేలా చేయండి. సీజన్​ 17 టైటిల్​ పోటీలో చేరిపోనివ్వండి.

మీ పిల్లలలోని గాయన ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఇది సరైన అవకాశం. జీ తెలుగు సరిగమప లిటిల్ ఛాంప్స్ లో పాల్గొని వారి కలలను నెరవేర్చండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.