|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ లా కథలు రాస్తారా? సినిమాలకు స్టోరీలు అందించాలని ఉందా? అయితే జీ రైటర్స్ రూమ్ ఛాన్స్ మీ కోసమే!

Published: 15-07-2025, 8:43 AM
త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ లా కథలు రాస్తారా? సినిమాలకు స్టోరీలు అందించాలని ఉందా? అయితే జీ రైటర్స్ రూమ్ ఛాన్స్ మీ కోసమే!

త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్ లాంటి ప్రముఖ దర్శకులు తమ సినీ ప్రయాణాన్ని రచయితలుగా ప్రారంభించారు. ఇప్పుడు మీరు కూడా ఆ అడుగు వేయడానికి ‘జీ రైటర్స్ రూమ్’ అద్భుతమైన వేదిక.

Key Points

1

త్రివిక్రమ్, పూరీ లాంటి స్టోరీ రైటర్స్ గా ఎదగడానికి అవకాశం.

2

జీ రైటర్స్ రూమ్ ద్వారా టీవీ, ఓటీటీ, సినిమాల్లో అవకాశాలు.

4

హిందీ, తెలుగుతో సహా అనేక భాషల్లో అవకాశాలు అందుబాటులో.

జీ రైటర్స్ రూమ్: ఒక అద్భుతమైన అవకాశం

త్రివిక్రమ్, కొరటాల శివ.. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లు. కానీ వీళ్ల జర్నీ సినిమా రైటర్స్ గానే మొదలైంది. సుకుమార్, పూరీ జగన్నాథ్ లాంటి అగ్రశ్రేణి దర్శకులు ఇప్పటికీ కథలు రాస్తున్నారు. ఇలా మీరు ఎదగాలని ఉందా? ఇలాంటి వాళ్లకు పాపులర్ టీవీ, ఓటీటీ నెట్ వర్క్ గ్రూప్ ‘జీ’ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా కథలు రాయాలనే ఆసక్తి, రచనపై పట్టు ఉండి.. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ‘జీ’ నెట్ వర్క్ చెప్పిన అద్భుతమైన వార్త ఇది. దేశవ్యాప్తంగా ఉన్న యువతరం, భవిష్యత్ స్క్రీన్ రైటర్లను గుర్తించి, వెలుగులోకి తీసుకొచ్చే లక్ష్యంతో, ఒక మైలురాయి కార్యక్రమంగా ‘జీ రైటర్స్ రూమ్’ను ప్రారంభించినట్లు ప్రముఖ కంటెంట్, టెక్నాలజీ పవర్‌హౌస్ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (‘Z’) సగర్వంగా ప్రకటించింది.

జీ రైటర్స్ రూమ్ అనేది ప్రతిభను అన్వేషించే ప్రయత్నం కంటే మించింది. ‘ యువర్స్ ట్రూలీ Z ‘ అనే కంపెనీ బ్రాండ్తో ముడిపడిన ఒక సృజనాత్మక ఉద్యమం ఇది. అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ తన కంటెంట్ సమర్పణను మరింత మెరుగుపరచడమే దీని లక్ష్యం. లేటెస్ట్ స్టోరీస్ కోసం డిమాండ్ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో.. మూల కథ చెప్పే సామర్థ్యం, స్క్రీన్ రైటింగ్ అనే వృత్తిగత ప్రపంచం మధ్య అంతరం తగ్గించాలన్నది ఈ కార్యక్రమ ఉద్ధేశం. ఎంపిక చేసిన రచయితలు ‘జీ’ పరిధిలోని విస్తృత స్థాయి టీవీ, ఓటీటీ , ఫిల్మ్ ప్లాట్‌ఫామ్‌ల కోసం కథలు రూపొందించేందుకు ఈ ఈ కార్యక్రమం అవకాశం అందిస్తుంది.

టాలీవుడ్ లో మీ కెరీర్‌ను ప్రారంభించండి

80 నగరాలు, 32 ఈవెంట్ సెంటర్లలో విస్తరించడం ద్వారా ఆన్-ఎయిర్, డిజిటల్, ఆన్-గ్రౌండ్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ కార్యక్రమం విస్తరించనుంది. హిందీ, మరాఠీ, బంగ్లా, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోని నిబద్ధత కలిగిన రైటర్స్ కోసం ఈ ప్రోగ్రాం క్రియేట్ చేశారు. రచయితలు వారి ఊహ, నిర్మాణం, కథన నైపుణ్యం పెంపొందించుకునే దిశగా, రైటర్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టే అపూర్వ అవకాశం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

70 మంది కొత్త రచయితలు, 30 మంది వర్థమాన నిపుణులను ఈ ప్రోగ్రామ్ కు ఎంపిక చేస్తారు. టీవీ, ఓటీటీ, సినిమాల్లో ‘జీ’కి అవసరమైన కంటెంట్‌ రాసేలా వీళ్లను తీర్చిదిద్దుతారు. ఎన్‌రోల్ చేసుకోవడానికి www.zeewritersroom.com వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

ఎంపిక ప్రక్రియ మరియు అవకాశాలు

ఈ కార్యక్రమం గురించి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ రాఘవేంద్ర హున్‌సూర్ మాట్లాడుతూ ..‘‘ భారతదేశంలోని ప్రముఖ రైటర్స్ లో ఒకరిగా మారేందుకు ఇది మేము అందిస్తున్న అవకాశం మాత్రమే కాదు. భవిష్యత్తు తరం రచయితల ప్రతిభను పెంపొందించే మా కర్తవ్యం కూడా ఇందులో భాగమే. జీలో మా అతిపెద్ద బలం మా కథనాలు మాత్రమే కాదు, మేము గుర్తించి, అవకాశం ఇచ్చే కథకులు కూడా అని మేము విశ్వసిస్తున్నాము. జీ రైటర్స్ రూమ్‌తో సరికొత్త స్వరాలు, ఇప్పటికింకా చెవినపడని ఆలోచనలు, నిజాయితీ కలిగిన భావోద్వేగాలు రూపం సంతరించుకునే ప్రదేశాన్ని మేము సృష్టిస్తున్నాము’’ అని అన్నారు.

జీ రైటర్స్ రూమ్ ద్వారా మీ సృజనాత్మకతను ప్రదర్శించి, టీవీ, ఓటీటీ మరియు సినిమా రంగాలలో విజయం సాధించండి. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.