
‘కాంతార’ నటుడు గుల్షన్ దేవయ్య, నటి గిరిజ ఓక్ కలిసి నటించిన ‘థెరపీ షెరపీ’ వెబ్ సిరీస్ షూటింగ్ నుండి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రొమాంటిక్ సీన్స్ చిత్రీకరణ సమయంలో గుల్షన్ చూపిన గౌరవం గురించి గిరిజ ఓక్ పంచుకున్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Key Points
నటుడు గుల్షన్ దేవయ్య ‘కాంతార: చాప్టర్1’లో విలన్‌గా నటించి పాపులర్ అయ్యారు.
ఆయన తదుపరి వెబ్ సిరీస్ ‘థెరపీ షెరపీ’లో నటి గిరిజ ఓక్‌తో కలిసి నటిస్తున్నారు.
రొమాంటిక్ సీన్స్ చిత్రీకరణలో గుల్షన్ దేవయ్య 17 సార్లు గిరిజ ఓక్‌ను ఓకేనా అని అడిగారు.
గుల్షన్ చూపించిన గౌరవానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గుల్షన్ దేవయ్య: ‘కాంతార’ నుండి ‘థెరపీ షెరపీ’ వరకు
హిందీలో పలు చిత్రాల్లో నటించి కన్నడ నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah)మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సమయంలోనే ‘కాంతార: చాప్టర్1’లో చాన్స్ రావడంతో విలన్‌గా కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘థెరపీ షెరపీ’(Therapy Sherapy)అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన సరసన గిరిజ నటించనుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గిరిజ ఓక్ (Girija Oak)సెట్‌లో జరిగిన విషయాలు పంచుకుంది. ‘‘సిరీస్ అయినా సినిమా అయినా కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు కొందరు సెట్‌లోనూ ఉంటారు.
నటీనటులు ఇబ్బందిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సీన్ ఎలా ఉండబోతోందో అని పూర్తిగా వివరిస్తారు. అయినా కొన్నిసార్లు డైలమాలో పడుతుంటాం. అయితే కొందరు నటులతో పనిచేసేటప్పుడు అసౌకర్యంగా ఉండదు. అలాంటి వారిలో గుల్షన్ దేవయ్య ఒకరు. దుస్థులు ధరించే ఉన్నాం.. అక్కడ చెడుగా ఏమీ లేదు. రొమాంటిక్ సీన్స్ చేస్తుండగా.. మీరు ఓకేనా.. ఇబ్బంది ఏం లేదు కదా అని 17 సార్లు అడిగాడు. ఆయన చూపించిన గౌరవం ప్రేమ నాకెంతో నచ్చాయి. తనవల్లే ఇబ్బంది లేకుండా పలు సీన్స్ పూర్తి చేశాను’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
గిరిజ ఓక్ అనుభవం: రొమాంటిక్ సన్నివేశాలపై
నటుడి గౌరవంపై నెటిజన్ల ప్రశంసలు
గుల్షన్ దేవయ్య చూపిన ఈ వృత్తిపరమైన మర్యాద, సహనటి పట్ల ఆయనకున్న గౌరవం ఇండస్ట్రీలో ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి సంఘటనలు నటీనటుల మధ్య మంచి వాతావరణాన్ని సృష్టించగలవని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


