|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిజామాబాద్ జిల్లాలో 179 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ.. ఖాళీలు ఇక్కడే!

Published: 09-07-2026, 10:09 AM
  • నిజామాబాద్ జిల్లాలో 179 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు భర్తీ
  • ఆర్మూర్, భీమ్‌గల్, బోధన్, డిచ్‌పల్లి, నిజామాబాద్ ప్రాజెక్టుల్లో ఖాళీలు
  • ఇంటర్మీడియట్ అర్హత, వయసు 18-35 సంవత్సరాలు
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 23.07.2026

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు శుభవార్త అందించింది. నిజామాబాద్ జిల్లాలో 179 అంగన్‌వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు మొదటి విడతలో 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో జరుగుతాయి.

ఖాళీలు ఉన్న ప్రాంతాలు ఇవే

ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు శుభవార్త చెప్పింది. నిజామాబాద్‌ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కింద జిల్లాలోని 5 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ నియామకాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు వచ్చాయి. మరికొన్ని జిలాల్లో రావాల్సి ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియ మెుదలైంది.

ఆర్మూర్, భీమ్‌గల్, బోధన్, డిచ్‌పల్లి, నిజామాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 179 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడైంది. అంగన్‌వాడీ టీచర్/హెల్పర్ అభ్యర్థులకు ఇంటర్మీడియట్ (12వ తరగతి) అర్హత ఉండాలి. ఒకవేళ హెల్పర్ పోస్టుకు ఇంటర్ చదివిన వారు అందుబాటులో లేకపోతే.. పదో తరగతి పాసైన వారిని పరిశీలిస్తారు.

దరఖాస్తు దారుల వయసు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. వినికిడి పరికరాలు పెట్టుకుని వినగలిగే వారు, ఇతరుల సహాయం లేకుండా పనులు చేసుకోగలిగే అంధత్వం ఉన్నవారు, పిల్లలను సంరక్షించగల సామర్థ్యం ఉన్న దివ్యాంగ మహిళలు కూడా ఈ పోస్టులకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉద్యోగాలకు కేవలం స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు అనే విషయం గుర్తుంచుకోవాలి.

అర్హతలు మరియు వయస్సు పరిమితి

గ్రామీణ ప్రాంతాల వారైతే అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో, పట్టణ ప్రాంతాల వారైతే సంబంధిత వార్డులో నివసిస్తూ ఉండాలి. ఎస్సీ కాలనీల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు, గిరిజన తండాలు/ఆవాసాల్లోని పోస్టులకు స్థానిక ఎస్టీ మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం ఎంపికలో ఇంటర్ మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకి 10 మార్కులు కేటాయించారు.

దరఖాస్తు ప్రక్రియ మరియు తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 23.07.2026గా నిర్ణయించారు. సర్టిఫికేట్ల పరిశీలన 27.07.2026 నుండి 05.08.2026 వరకు ఉంటుంది. ఈ సందర్భంగా కొన్ని పత్రాలు తీసుకెళ్లాలి. వయస్సు/పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (SSC మేమో), కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత పత్రాలు (ఇంటర్/ఆపై మార్కుల లిస్ట్), నివాస ధృవీకరణ పత్రం, దివ్యాంగులైతే ‘సదరం’ సర్టిఫికేట్, వితంతువులైతే భర్త డెత్ సర్టిఫికేట్, అనాథలైతే దానికి సంబంధించిన అధికారిక పత్రం ఉండాలి. అర్హత గల మహిళా అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తులను సమర్పించుకోవచ్చు.

అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ 23.07.2026 కావడంతో వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.