|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నరకంలో విధించే శిక్షలపై 2 ఓటీటీ సినిమాలు.. కళ్లకు కట్టినట్లు చూపించే భయంకరమైన సీన్స్.. ఈ 2 ఓటీటీల్లో చూసేయండి!

Published: 01-06-2025, 8:14 PM
నరకంలో విధించే శిక్షలపై 2 ఓటీటీ సినిమాలు.. కళ్లకు కట్టినట్లు చూపించే భయంకరమైన సీన్స్.. ఈ 2 ఓటీటీల్లో చూసేయండి!

నరకం అంటే ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ, రెండు ఓటీటీ సినిమాలు నరక శిక్షలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. ఈ సినిమాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

నరక శిక్షలను చూపించే రెండు ఓటీటీ సినిమాలు.

2

భయంకరమైన సన్నివేశాలతో కూడిన సౌత్ కొరియన్ సినిమాలు.

4

బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచిన ఈ సినిమాలు మంచి రేటింగ్‌లు సాధించాయి.

నరక శిక్షలు మరియు సినిమా

నరకం చూశాను అని చాలా మంది బాధలో కానీ, సమస్యలు ఫేస్ చేసినపపుడు కానీ వాడుతుంటారు. ఎంతో బాధ, కష్టం, భయం, నొప్పి వంటి భావాలు నరకంలో కలుగుతుంటాయనేది అందరి భావన. చేసిన కర్మల ఫలితానుసారం నరకం లో శిక్షలు పడుతుంటాయని అందరు నమ్ముతారు.

మనుషులు చేసిన తప్పులు, నేరాలకు పడే శిక్షలు గరుడు పురాణంలో ఎలా ఉన్నాయో కాస్తా చెబుతూ అపరిచితుడు మూవీలో డైరెక్టర్ శంకర్ చూపించారు. అయితే, పూర్తిగా నరకంలో విధించే శిక్షలపై ఓ సినిమా ఉంటే. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తే.. ఒకటి కాదు రెండు ఓటీటీ సినిమాల్లో నరకంలో విధించే శిక్షలను చూపించారు.

మనిషి చేసే ఒక్కో తప్పుకు ఎలాంటి శిక్ష ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా, భయంకరమైన సీన్స్‌తో ఈ రెండు ఓటీటీ సినిమాల్లో చూపించారు. ఆ ఓటీటీ సినిమాలే ‘ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది టూ వరల్డ్స్’, ‘ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది లాస్ట్ 49 డేస్’. ఈ రెండు సినిమాలు సౌత్ కొరియన్ ఫాంటసీ అడ్వెంచర్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కాయి.

‘ఎలాంగ్ విత్ ది గాడ్స్’ సినిమాల వివరాలు

ది టూ వరల్డ్స్ సినిమా 2017లో విడుదల అయితే.. ఆ తర్వాతి సంవత్సరం 2018లోనే ది లాస్ట్ 49 డేస్ రిలీజ్ అయింది. రెండు సినిమాలకు మంచి ఆదరణ లభించింది. ది టూ వరల్డ్స్ సినిమాకు 18.3 మిలియన్ డాలర్ల బడ్జెట్ అయితే బాక్సాఫీస్ వద్ద 109.4 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి 7.2 రేటింగ్ సాధించింది.

ఇక మొదటి పార్ట్‌కు సీక్వెల్‌గా వచ్చిన రెండో సినిమా ‘ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది లాస్ట్ 49 డేస్’కు 18.3 మిలియన్ డాలర్స్ ఖర్చు అయితే బాక్సాఫీస్ వద్ద 92.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఇక ఐఎమ్‌డీబీ నుంచి 10కి 7.1 రేటింగ్ సంపాదించుకుంది. ఈ రెండు సినిమాలకు కిమ్ యోంగ్ హవా దర్శకత్వం వహించారు.

జూ హో మిన్ రాసిన ఎలాంగ్ విత్ ది గాడ్స్ నవల ఆధారంగా ఈ రెండింటిని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్‌లలో ఎలాంగ్ విత్ ది గాడ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో కొరియన్, అమెజాన్ ప్రైమ్‌ లో ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఈ రెండు అందుబాటులో ఉన్నాయి.

ఎక్కడ చూడాలి?

‘ఎలాంగ్ విత్ ది గాడ్స్: ది టూ వరల్డ్స్’ కథలోకి వెళ్తే.. ఓ ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయిన హీరో దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వస్తారు. వారు హీరోను నరకానికి తీసుకెళ్తారు.

హీరోకు మళ్లీ పునర్జన్మ కావాలంటే అతను చేసిన తప్పులకు తగిన శిక్షలు అనుభవించి అందులో నుంచి బయట పడాలి. అలా అయితే, మరో జన్మ ఉంటుందని చెబుతారు. ఆ శిక్షల నుంచి హీరో బయటపడ్డాడా?, ఆ శిక్షలు ఎలా ఉన్నాయనేదే? ఈ సినిమా కథ.

మొత్తంమీద, ‘ఎలాంగ్ విత్ ది గాడ్స్’ సినిమాలు నరక శిక్షలను చూపించే వినూత్నమైన ప్రయత్నం. నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.