|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా

Published: 10-12-2025, 8:48 AM
2025 Missed Heroines: ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని 8 మంది హీరోయిన్లు, 2026లో వీరిదే హవా
  • దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్ 2025లో కనిపించలేదు, 2026లో వారి సినిమాలు విడుదల కానున్నాయి.
  • ఆలియా భట్ కూడా 2025లో వెండితెరపై సందడి చేయలేదు, 2026లో ‘లవ్ అండ్ వార్’తో వస్తుంది.
  • ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు, 2027లో తెలుగు సినిమా ‘వారణాసి’తో రానుంది.
  • కరీనా, కత్రినా, ఐశ్వర్య రాయ్ 2025లో సినిమాలు చేయలేదు; కత్రినాకి ఇటీవలే మగబిడ్డ జన్మించాడు.

ఈ ఏడాది 2025లో పలువురు స్టార్ హీరోయిన్లు వెండితెరపై కనిపించలేదు. దీపికా, శ్రద్ధా, ఆలియా వంటి తారలు 2026లో తిరిగి రావడానికి సిద్ధంగా ఉండగా, ప్రియాంక, కరీనా, కత్రినా వంటి మరికొందరు నటీమణులు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. వారి ప్రస్తుత స్థితి, భవిష్యత్ ప్రణాళికలు ఇక్కడ చూడండి.

2026లో రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్లు

ప్రభాస్‌తో `కల్కి 2898 ఏడీ`లో నటించిన దీపికా పదుకొణె ఈ ఏడాది మిస్‌ అయ్యింది. ఆమె నటించిన ఒక్క సినిమా కూడా 2025లో విడుదల కాలేదు. అయితే, 2026లో ‘కింగ్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో `ఏఏ22`లో కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే.

`సాహో`లో ప్రభాస్‌ తో రొమాన్స్ చేసిన శ్రద్ధా కపూర్ 2025లో ఏ సినిమాలోనూ కనిపించలేదు.   ఆమె 2026లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఆమె సినిమా ‘ఏథా’ 2026లో విడుదల కానుంది.

`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన అలియాభట్‌ హవా 2025 బాక్సాఫీస్ వద్ద కనిపించలేదు. ఆలియా కూడా 2026లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె సినిమా ‘లవ్ అండ్ వార్’  విడుదల కాబోతుంది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న తారలు

ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్ కంటే హాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ఆమె చాలా కాలంగా ఏ హిందీ సినిమాలోనూ కనిపించలేదు. 2026లో ఆమె సినిమా ఏదీ రావడం లేదు. 2027లో తెలుగులో నటిస్తోన్న `వారణాసి` చిత్రంతో రాబోతుంది.

2025లో కరీనా కపూర్ స్క్రీన్‌పై కనిపించలేదు. కరీనా ఇప్పుడు కుటుంబంపై ఎక్కువ దృష్టి పెడుతూ, సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ సినిమా లేదు.

రాణీ ముఖర్జీ ఇప్పుడు వెండితెరపై అరుదుగా కనిపిస్తున్నారు. ఆమె సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తారు. 2025లో ఆమె సినిమా ఏదీ రాలేదు. 2026లో ‘మర్దానీ 3’తో సందడి చేయనుంది.

2025లో కనిపించని సినీ తారలు: వారి భవిష్యత్ ప్రణాళికలు

2025లో కత్రినా కైఫ్ సినిమా కూడా ఏదీ విడుదల కాలేదు. బహుశా 2026లో కూడా ఆమె సినిమా ఏదీ రాకపోవచ్చు. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ లైఫ్‌ కే పరిమితమయ్యింది.  ఇటీవలే ఆమె మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది `ఛావా`తో సంచలనం సృష్టించిన విక్కీ కౌశల్‌ భార్యనే కత్రినా.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఈ ఏడాది కూడా నిరాశ పరిచింది.  వచ్చే ఏడాది కూడా ఆమె నుంచి సినిమాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

2025లో చాలామంది స్టార్ హీరోయిన్లు కనిపించకపోయినా, 2026లో వారిలో ఎక్కువ మంది తమ సినిమాలతో తిరిగి వచ్చి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ తారల రాక కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.