|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

21 రోజుల లాక్‌డౌన్ సినిమా, రాత్రి నుంచి అమలు, కొత్త అప్‌డేట్ వైరల్

Published: 30-11-2025, 12:26 AM
21 రోజుల లాక్‌డౌన్ సినిమా, రాత్రి నుంచి అమలు, కొత్త అప్‌డేట్ వైరల్
  • అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘లాక్‌డౌన్’ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.
  • ఏఆర్ జీవా దర్శకత్వంలో, కరోనా వ్యాప్తిని అరికట్టే 21 రోజుల లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
  • సినిమాలో అనుపమ పరమేశ్వరన్ అనిత అనే పాత్రలో కనిపిస్తారు, ఆమె ప్రవర్తన కథను మలుపు తిప్పుతుంది.
  • సినిమా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన “లాక్‌డౌన్” సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. సినిమా కథాంశం, విడుదల వివరాలు ఇక్కడ చూడండి.

లాక్‌డౌన్ సినిమా: విడుదల తేదీ, నటీనటులు

కరోనా వ్యాప్తి ప్రభావం వల్ల  దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ప్రపంచంతో పాటు మన దేశాన్ని కుదిపేసిన ఘటన కరోనా వ్యాప్తి. ఇందులో ఎంతోమంది తమ ఆత్మీయులను కోల్పోయారు. చాలామంది రోజువారీ జీవనోపాధి దెబ్బతింది. అన్ని పరిశ్రమలపై కరోనా ప్రభావం పడింది. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అయిపోయింది.

మరోసారి  లాక్‌డౌన్‌ ను జనాలు చూడబోతున్నారు.  మళ్లీ 21 రోజులు లాక్‌డౌన్‌ అమలు కాబోతోంది. అయితే అది నిజం జీవితంలో కాదు.. అది సినిమాలో మాత్రమే. డిసెంబర్ 5న ‘లాక్‌డౌన్’ సినిమా విడుదల కానుంది. ఏఆర్ జీవా దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఇందులో చార్లీ, నిరోషా, లివింగ్‌స్టన్, ప్రియా వెంకట్ వంటి ప్రముఖులు నటించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

అనుపమ పరమేశ్వరన్ పాత్ర: కథలో కీలక మలుపు

లాక్‌డౌన్‌  సినిమా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకురాత్రి నుంచి 21 రోజుల లాక్‌డౌన్ విధిస్తారు. దాంతో చాలామంది బ్రతకడం కష్టమై పోతుంది. ఎవరికి వారు తెలిసినవారికి  ఫోన్ చేసి డబ్బులు అడిగే పరిస్థితి వస్తుంది.

లాక్‌డౌన్‌లో నిజంగా ఏం జరిగిందో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈసినిమా రిలీజ్ అయిన తరువాతి రోజు బాలకృష్ణ అఖండ 2 రాబోతోంద. ఈ సినిమా రిలీజ్ రోజే..  కార్తీ నటించిన ‘వా వాతియారే’ కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

సినిమా కథాంశం: వైరల్ ట్రైలర్ హైలైట్స్

ఈసినిమాలో ప్రధాన పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటించింది. ఆమె  అనిత పాత్రలో కనిపించబోతోంది. ఎప్పుడు బయటతిరేగే అమ్మాయిగా అనుపమ నటిస్తోంది. ఆమె తరచుగా బయటకు వెళ్తుంటుంది… ఎవరు ఏమడిగినా కోప్పడుతుంది. ఎప్పుడూ ఫోనే చూస్తుంటుంది… కానీ కరోనా టైమ్ లో ఆమె చేసిన పని.. సినిమా కథనే మలుపు తిప్పుతుంది. మరి ఈమూవీ ఎలా ఉంటుందో చూడాలి.

కరోనా నేపథ్యంలో రూపొందించిన ‘లాక్‌డౌన్’ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ నటన, ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. డిసెంబర్ 5న దీని పరుగు మొదలవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.