
టాలీవుడ్ నటి ఇలియానా తాజాగా సోషల్ మీడియాలో తన మాతృత్వ అనుభవం గురించి పోస్ట్ చేసింది. తన బిడ్డ స్పర్శ, చిరునవ్వుతో కలిగే ఆనందాన్ని, అలాగే తల్లిదండ్రుల బాధ్యతల కష్టాలను ఆమె పంచుకుంది. ఇంకా, సినిమాలకు తిరిగి రావడం గురించి కూడా ఆమె మాట్లాడింది.
Key Points
ఇలియానా తల్లిదండ్రుల అనుభవం ఆమె ఊహించిన దానికి భిన్నంగా ఉందని వెల్లడించింది.
ప్రతిరోజూ 24 గంటలు విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నానని తెలిపింది.
అయినప్పటికీ, తన బిడ్డ యొక్క చిరునవ్వు మరియు స్పర్శ అన్ని కష్టాలను మాయం చేస్తుందని చెప్పింది.
సినిమాలకు మిస్ అవుతున్నానని, కానీ త్వరలోనే ఇండస్ట్రీకి తిరిగి వస్తానని తెలిపింది.
ఇలియానా మాతృత్వ అనుభవం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా(Ileana) ‘దేవదాసు’(Devadasu) చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న ఆమె టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్‌తో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయింది. బేబీ బంప్‌తో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చింది. ‘‘సినిమాలకు చాలా మిస్ అవుతున్నా. రైడ్ నాకు ప్రత్యేకమైన చిత్రం. నిజం చెప్పాలంటే ‘రైడ్-2’(Ride-2) స్టార్ట్ చేసినప్పుడు నన్ను టీమ్ నటించమని అడిగింది. కానీ నాకు బిడ్డ పుట్టడంతో నా ప్రాధాన్యతలు మారిపోయాయి.
‘రైడ్-2’ ప్రమోషన్స్‌లో వాణి కపూర్(Vaani Kapoor) ఎంతో యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఆమె పాత్ర ప్రత్యేకతను తీసుకువచ్చే ఉంటుందని నమ్ముతున్నా. నేను సినిమా ఇండస్ట్రీకి త్వరలోనే వస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక మాతృత్వపు అనుభూతి గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఊహించిన దానికి చాలా భిన్నంగా ఉంది.. ఈ ఫేజ్ ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు.. నేను ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉంది.. ప్రతీ రోజూ 24 గంటలు రెస్ట్ అన్నదే ఉండటం లేదు.. కానీ ఎంత కష్టంగా ఉన్నా కూడా నా బిడ్డ స్మైల్, స్పర్శతో అవన్నీ మాయం అవుతున్నాయి. మాతృత్వం అనేది గొప్ప ఫీలింగ్’’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సినిమాలకు తిరిగి రావడం గురించి ఇలియానా
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
చివరగా, ఇలియానా తన మాతృత్వ ప్రయాణం గురించి తన అనుభవాలను పంచుకుంటూ, త్వరలోనే సినిమాలకు తిరిగి రావాలనే ఆశను వ్యక్తం చేసింది. ఆమె మాటలు అభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి.


