
ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలోని ‘కాగితం పడవలు’ సినిమా గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. లవ్లీ ఎమోషన్స్ మరియు అందమైన విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది ఈ గ్లింప్స్. రెండు హార్ట్ టచింగ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది.
Key Points
కాగితం పడవలు సినిమా గ్లింప్స్ విడుదలైంది.
లవ్లీ ఎమోషన్స్‌తో కూడిన హృదయస్పర్శి కథ.
అందమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.
కాగితం పడవలు గ్లింప్స్ విడుదల
ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో ఓ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ తెరకెక్కుతోంది. ఈ మూవీని ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కీర్తన నరేష్ టీఆర్. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి “కాగితం పడవలు’అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఇవాళ (ఆగస్టు 9) కాగితం పడవలు గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం లవ్లీ ఎమోషన్స్‌తో ఈ గ్లింప్స్ సాగింది. కేవలం 28 సెకన్ల రన్ టైమ్ ఉన్న కాగితం పడవలు గ్లింప్స్‌లోని రెండే రెండు డైలాగ్స్ హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి.
“చాలా దూరం వెళ్లిపోయావు గోదావరి ” అని అబ్బాయి గొంతు అంటే.. “నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్” అని అమ్మాయి వాయిస్ వినిపించింది. ఆ డైలాగ్స్‌కు తగినట్లుగా బీచ్ వ్యూ చూపించారు. ఎంతో ఆహ్లాదంగా, అందంగా విజువల్స్ ఉన్నాయి.
హృదయాన్ని తాకే కథాంశం
అలాగే, ఈ రెండు డైలాగ్స్ ప్రేమకథలోని డెప్త్ తెలియజేసేలా ఉన్నాయి. తీరంలో ఓ జంట కలుసుకోవడం, విజువల్స్, నేపథ్య సంగీతం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ గ్లింప్స్ కాగితం పడవలు సినిమాపై చాలా క్యురియాసిటీ క్యూరియాసిటీ పెంచాయి.
డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం లవ్లీ ఎమోషన్స్, హృదయాన్ని తాకే కథ, అందమైన విజువల్స్‌తో ఈ కాగితం పడవలు సినిమాను మలిచినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు ఈ కాగితం పడవలు గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విస్తృతంగా షేర్ అవుతుంది.
అద్భుతమైన విజువల్స్
అలాగే, ఈ గ్లింప్స్ రానున్న కాగితం పడవలు ప్రమోషనల్ కంటెంట్‌పై చాలా మంచి అంచనాలు పెంచింది. ఇకపోతే కాగితం పడవలు సినిమాకు ఏఐఎస్ నౌఫల్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. రుద్రసాయి అండ్ జానా డీవోపీగా పని చేస్తున్నారు. జెస్విన్ ప్రభు ఎడిటర్‌గా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎం. హిమ బిందు వర్క్ చేస్తున్నారు.
ఇక కాగితం పడవలు సినిమా త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగితం పడవలు రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. అయితే, కాగితం పడవలు సినిమాలోని నటీనటుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
కాగితం పడవలు గ్లింప్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. త్వరలో విడుదలయ్యే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడం ఖాయం. రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.


