|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘టాక్సిక్’ మాస్ అప్‌డేట్: యష్ ఫాదర్స్ డే సర్‌ప్రైజ్.. రిలీజ్ డేట్ ఫిక్స్! ఈసారి పక్కా!

Published: 21-06-2026, 11:56 PM
'టాక్సిక్' మాస్ అప్‌డేట్: యష్ ఫాదర్స్ డే సర్‌ప్రైజ్.. రిలీజ్ డేట్ ఫిక్స్! ఈసారి పక్కా!
  • యష్ ‘టాక్సిక్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో.
  • ఫాదర్స్ డే సందర్భంగా ‘టాక్సిక్’ టీమ్ నుండి సర్‌ప్రైజ్, పవర్ఫుల్ పోస్టర్‌తో అనౌన్స్‌మెంట్.
  • ‘కేజీఎఫ్ 2’ తర్వాత యష్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఆకాశంలో.
  • నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ వంటి స్టార్స్‌తో ‘టాక్సిక్’ భారీ తారాగణం.

రాకింగ్ స్టార్ యష్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది! ‘టాక్సిక్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఫాదర్స్ డే సందర్భంగా వచ్చిన ఈ సర్‌ప్రైజ్ అప్‌డేట్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

యష్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఖరారు!

కన్నడ స్టార్ ‘రాకింగ్ స్టార్’ యష్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘కేజీఎఫ్ 2’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నుంచి రాబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనేది ఇన్నాళ్లూ క్లారిటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా టాక్సిక్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ‘టాక్సిక్‌’ సినిమాని ముందుగా 2026 మార్చి 19న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో, చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. జూన్ 4న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. వర్క్ పెండింగ్ ఉండటంతో ఈసారి కూడా చెప్పిన సమయానికి రిలీజ్ చేయలేకపోయారు. దీంతో సినిమా విడుదలపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఏడాది రిలీజ్ ఉండకపోవచ్చని, 2027 సంక్రాంతికి వస్తుందనే రూమర్స్ వినిపించాయి. అయితే యష్ సినిమాని ఈ సంవత్సరమే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ‘టాక్సిక్‌’ చిత్రాన్ని 2026 ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా “నీ తండ్రిని గౌరవించు..” అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ పంచుకున్నారు. ఇందులో యష్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించారు. రాయ, టికెట్ లుక్స్ లో కనువిందు చేశారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా వదిలిన పోస్టర్.. స‌రికొత్త‌గా, ప‌వ‌ర్ఫుల్ గా ఉంది. ‘టాక్సిక్‌’ చిత్రానికి య‌ష్‌, గీతూ మోహ‌న్ దాస్ కలిసి కథ అందిస్తున్నారు. ఇందులో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ రాజీవ్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్ వ‌ర్క్‌ను ఉజ్వల్ కులకర్ణి.. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను టీపీ ఆబిద్ నిర్వహిస్తున్నారు. ‘జాన్ విక్’ వంటి హాలీవుడ్ చిత్రాల‌కు ప‌ని చేసిన యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ, జాతీయ అవార్డు గ్రహీత అన్బరివ్ కలిసి ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ‘టాక్సిక్‌’ సినిమాని ఒకేసారి ఇంగ్లీష్‌, క‌న్న‌డ‌లో చిత్రీక‌రిస్తున్నారు. హిందీ, తెలుగు, మ‌ల‌యాళం స‌హా ఇత‌ర భాష‌ల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఫాదర్స్ డే గిఫ్ట్: పవర్ఫుల్ పోస్టర్!

స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్ వివరాలు!

మొత్తానికి ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఖరారు కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. యష్ కెరీర్‌లోనే ఇదొక మైలురాయి కావడం ఖాయం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.