
53 ఏళ్ల సీనియర్ నటి టబు మరియు 29 ఏళ్ల యువ నటుడు ఇషాన్ ఖట్టర్ కలిసి నటించిన వెబ్ సిరీస్ లోని రొమాంటిక్ సన్నివేశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వారి వయసు తేడాను పట్టించుకోకుండా వారు నటించిన విధానం ప్రశంసలు అందుకుంటోంది.
Key Points
53 ఏళ్ల టబుతో 29 ఏళ్ల ఇషాన్ ఖట్టర్ రొమాంటిక్ సన్నివేశాలు.
వయసు తేడాను పట్టించుకోకుండా నటించిన ఇద్దరు నటులు.
'ఎ సూటబుల్ బాయ్' వెబ్ సిరీస్‌లో వారి నటన ప్రశంసలు అందుకుంది.
ఇషాన్ ఖట్టర్ 'హోమ్ బౌండ్' సినిమాతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడ్డాడు.
టబు మరియు ఇషాన్ ఖట్టర్ రొమాన్స్
53 ఏళ్ల సీనియర్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో కాదు టబు. ఆమె కంటే 24 ఏళ్ల చిన్న హీరో ఎవరో కాదు బాలీవుడ్ యంగ్ స్టార్ ఇషాన్ ఖట్టర్. తాజాగా టబుతో రొమాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి మరోసారి వైరల్ న్యూస్ అయ్యాడు ఇషాన్. ‘ధడక్’ సినిమాతో హీరోగా సినీప్రియుల ముందుకొచ్చిన ఇషాన్, ప్రస్తుతం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన ‘హోమ్ బౌండ్ మూవీ 78వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ అయ్యింది.
రీసెంట్ గా తన కెరీర్‌లో గుర్తుండిపోయే వెబ్ సిరీస్ ‘ఎ సూటబుల్ బాయ్’ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఇషాన్. దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఆడియన్స్ తో షేర్ చేసుకున్నాడు. ఆ సిరీస్‌లో టబుతో కలిసి చేసిన రొమాంటిక్ సీన్స్ పై స్పందించారు. టబు తనకంటే 24 ఏళ్లు పెద్దది అయినా, వారిద్దరి మధ్య వయసు తేడా తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆయన అన్నారు.
వయసు తేడా ప్రభావం
ఇషాన్ ఖట్టర్ మాట్లాడుతూ,..ఇలాంటి సన్నివేశాలు చూసి ప్రేక్షకులకు వింతగా అనిపించొచ్చు. కానీ ఆ కథను రాసిన తీరు ఆ సన్నివేశానికి పూర్తి న్యాయం చేసింది. మేము వయసు తేడా గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. టబుతో నటించడం అంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమెతో నటిస్తే ఎంతో సేఫ్‌గా ఫీలవుతాను. ఏ సీన్ చేస్తున్నామో అర్థం చేసుకునే నటి ఆమె. అందుకే నేనూ కంఫర్ట్‌గా ఫీల్ అయ్యాను” అని అన్నారు.
టబు గురించి మాట్లాడుతూ, “ఆమె చాలా సరదాగా ఉంటారు. సెట్‌లో పిల్లలా ప్రవర్తిస్తారు. జోక్స్ వేస్తారు. కానీ సీన్ లోకి రాగనే వెంటనే పాత్రలో పూర్తిగా లీనమైపోతారు. ఆమెతో పనిచేయడం నాకు మంచి అనుభవం” అని ఇషాన్ అన్నారు.
‘ఎ సూటబుల్ బాయ్’ వెబ్ సిరీస్
ఇషాన్ ప్రస్తుతం ‘ది రాయల్స్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు, ‘హోమ్ బౌండ్’ వంటి ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు యంగ్ హీరో. ‘హోమ్ బౌండ్’ చిత్రం కేన్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. ఈసినిమాతో బాలీవుడ్‌లో ఇషాన్ ఇమేజ్ మరింత పెరిగింది. వయస్సు, అనుభవం అనే అంశాలను పక్కన పెడితే.. ఇండస్ట్రీలో చాలా సైలెంట్ గా ఎదుగుతున్నాడు యంగ్ స్టార్. తన నటనతో పాటు, యాటీట్యూడ్ తో కూడా ఫ్యాన్స ను బుట్టలో వేస్తున్నాడు ఇషాన్.
టబు మరియు ఇషాన్ ఖట్టర్‌ల నటన ప్రతిభ, వారి మధ్య ఉన్న వయసు తేడాను అధిగమించి, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇషాన్ కెరీర్ లో ఇది మరో మైలురాయి.


