|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సల్మాన్-నయన్ ప్రాజెక్ట్: వంశీ పైడిపల్లి ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాకే! ముంబైలో యాక్షన్ ధమాకా!

Published: 06-06-2026, 5:01 AM
సల్మాన్-నయన్ ప్రాజెక్ట్: వంశీ పైడిపల్లి ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాకే! ముంబైలో యాక్షన్ ధమాకా!
  • సల్మాన్, నయనతార భారీ ప్రాజెక్ట్ ముంబై షెడ్యూల్ జూన్ 10 నుండి స్టార్ట్.
  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు చిత్రీకరణ.
  • బాంద్రా పరిసర ప్రాంతాల్లో కార్ ఛేజింగ్‌లు, వాహన స్టంట్స్‌ షూటింగ్.
  • దిల్ రాజు నిర్మాణంలో సినిమా హైలైట్ అయ్యే ప్రత్యేక యాక్షన్ సెట్.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతారల కాంబినేషన్లో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ సంచలన అప్‌డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

ముంబైలో వంశీ పైడిపల్లి మాస్టర్ ప్లాన్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా కనిపించనుంది.దిల్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరగడంతో పాటుగా.. షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా,క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. కీలకమైన షూటింగ్ షెడ్యూల్ జూన్ 10 నుండి ముంబై నగరంలో ప్రారంభం కాబోతోందని టాక్. ఈ షెడ్యూల్‌లో సినిమాకు అత్యంత కీలకమైన భారీ యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించడానికి దర్శకుడు వంశీ పైడిపల్లి ప్లాన్ చేశారట. ముంబై నగరంలోని వాస్తవిక లొకేషన్లలో ఈ యాక్షన్ సీన్లను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ యాక్షన్ సన్నివేశాలకు ఒక మెట్రోపాలిటన్ నగరం, వాతావరణం, వైవిధ్యం చాలా అవసరం. అందుకే బాంద్రా దాని పరిసర ప్రాంతాలలోని పబ్లిక్ లొకేషన్లలో ఈ షూటింగ్ జరగనున్నట్లు టాక్. సల్మాన్ ఖాన్, నయనతార ఇద్దరిపై ఇక్కడ కార్ ఛేజింగ్‌లు, వాహనాలతో కూడిన స్టంట్లు, కోట్లాట, భారీ జనం మధ్య సాగే యాక్షన్ సీన్లను షూట్ చేయబోతున్నారట. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత, దర్శకుడు కలిసి సల్మాన్ ఖాన్ కోసం ఒక ప్రత్యేకమైన యాక్షన్ సెట్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఓ సీన్ సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలిచేలా ఉంటుందట. ఈ సీన్ మొదట ఒకరిని తరుముకుంటూ వెళ్లే ఛేజింగ్ సీన్‌లా ప్రారంభమై, ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య జరిగే ఒక పెద్ద ఘర్షణగా మారుతుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది తెలుసుకున్న వారంతా వంశీ పైడిపల్లి ప్లాన్ అదిరిపోయిందని అంటున్నారు.

యాక్షన్ సీన్ల కోసం భారీ బడ్జెట్.. హైలైట్ అదే!

సల్మాన్-నయన్ కాంబోలో ఊహించని యాక్షన్!

సల్మాన్ ఖాన్-నయనతార ప్రాజెక్ట్ నుండి వస్తున్న ఈ సంచలన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అదిరిపోయే విశేషాల కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.