|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

6జ‌ర్నీ రివ్యూ – సెల్‌ఫోన్‌తో మ‌ర్డ‌ర్స్ – టెర్ర‌రిజం బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన లేటెస్ట్ తెలుగు మూవీ ఎలా ఉందంటే?

Published: 09-05-2025, 8:37 AM
6జ‌ర్నీ రివ్యూ - సెల్‌ఫోన్‌తో మ‌ర్డ‌ర్స్ - టెర్ర‌రిజం బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన లేటెస్ట్ తెలుగు మూవీ ఎలా ఉందంటే?

రవి ప్రకాష్ రెడ్డి నటించిన ‘6 జర్నీ’ సినిమా సెల్ ఫోన్ ద్వారా జరిగే హత్యలు, టెర్రరిజం నేపథ్యంలో సాగుతుంది. ఆరుగురు స్నేహితులు గోవా ప్రయాణంలో భయంకరమైన సంఘటనలను ఎదుర్కొంటారు. ఈ సినిమా కథ మరియు నటన ఎలా ఉన్నాయో చూద్దాం.

కథానాయకులు మరియు కథ

రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో న‌టించిన మూవీ ‘6 జర్నీ’. ఈ సినిమాకు బసీర్ ఆలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మే 9న థియేట‌ర్ల‌ లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే?

హైదరాబాద్ సిటీలో వేర్వేరు చోట్ల మర్డర్స్ జరుగుతాయి. ఓ కొత్త నంబ‌ర్ నుంచి వ‌చ్చిన ఫోన్ కాల్ ను లిఫ్ట్ చేసిన కొంతమంది చెవిలో నుంచి రక్తం కారి మరణిస్తారు. మరోవైపు సెల్ సిగ్నల్స్ కంట్రోల్ చేసే గవర్నమెంట్ ఆఫీసర్స్ కిడ్నాప్ అవుతారు. సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి.

ఇదే టైమ్‌లో తరుణంలో ఆరుగురు స్నేహితులు (రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి & కో) గోవా ప్రయాణం అవుతారు. జర్నీలో ఓ అప‌రిచిత వ్య‌క్తికి వారు లిఫ్ట్ ఇస్తారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన హ‌త్య‌ల‌కు తాము లిఫ్ట్ ఇచ్చిన వ్య‌క్తికి ఏదో క‌నెక్ష‌న్ ఉంద‌ని ఫ్రెండ్స్ గ్యాంగ్ భ‌య‌ప‌డిపోతారు. ఆ సైకో నుంచి తప్పించుకొనే క్రమంలో తీవ్రవాదుల‌కు దొరికిపోతారు.

అమాయ‌కులైన ఆరుగురు స్నేహితుల‌ను టెర్ర‌రిస్ట్‌లు ఎందుకు కిడ్నాప్ చేశారు? వారి డిమాండ్ ఏమిటి? ఫోన్ వచ్చిన వెంటనే కొందరు ఎలా మరణించారు? అందుకు కారణం ఏమిటి? దేశంలో కుట్ర‌లు ప‌న్నేందుకు చైనా వేసిన ప‌థ‌కం ఏమిటి? తీవ్రవాదుల నుంచి రాబోయే ముప్పును ఆ ఆరుగురు ఎలా ఎదుర్కొన్నారు? ఆ సైకో అసలు రూపం ఏమిటి? అన్న‌దే 6 జ‌ర్నీ మిగిలిన క‌థ‌.

సెల్ ఫోన్ మరియు హత్యల రహస్యం

టెర్ర‌రిజం బ్యాక్‌డ్రాప్ సినిమా అన‌గానే పాకిస్థాన్‌ను తెర‌పైకి తీసుకురావ‌డం సినిమాల్లో కామ‌న్‌గా క‌నిపిస్తుంది. రెగ్యుల‌ర్ ఫార్మెట్‌కు భిన్నంగా చైనా తీవ్రవాదం గురించి సిక్స్ జర్నీ సినిమాలో చూపించారు. తీవ్రవాదం అంటే తుపాకీ పట్టి చేసేది మాత్రమే కాదని టెక్నాలజీ పరంగా దేశంలో ఎలాంటి విధ్వంసాల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉందో సందేశం, యాక్ష‌న్ అంశాల‌తో ఈ మూవీలో చూపించారు.

6 జ‌ర్నీ మూవీ కోసం దర్శకుడు బషీర్ ఆలూరి ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకు తీవ్రవాదం నేపథ్యంలో టాలీవుడ్ స్క్రీన్ మీద రానిడిఫ‌రెంట్ పాయింట్‌ను ఈ మూవీలో ట‌చ్ చేశారు. అయితే ఆ కథను అంతే ఎఫెక్టివ్ గా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో మాత్రం కాస్తంత క‌న్ఫ్యూజ్ అయ్యారు.

సినిమా ఆరంభంలో వ‌చ్చే స‌న్నివేశాలు ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ ద్వారా టెర్ర‌రిస్ట్‌లు మర్డర్స్‌ చేయడంఅనేది ఆసక్తిగా ఉంటుంది. ఆ తరువాత హీరో, అత‌డి ఫ్రెండ్స్ గ్యాంగ్ పరిచయం , ఆ ట్రావెలింగ్ ఎపిసోడ్స్ రెగ్యులర్ సినిమాల్లో చూసినట్టే రొటీన్‌గా సాగుతాయి.

లవ్ స్టోరీస్, ఈ క్ర‌మంలో వ‌చ్చే కామెడీ ఎపిసోడ్స్ సోసోగానే అనిపిస్తా.‌‌.. హత్యలు చేసింది లిఫ్ట్ అడిగిన వ్యక్తి అని హీరో ఫ్రెండ్స్‌లో అనుమానం వచ్చిన తర్వాతే క‌థ‌లో కొంచెం టెన్షన్ క్రియేట్ అవుతుంది. దేశభక్తి మీద హిందూ ముస్లిం క్రిస్టియానిటీ మీద రాసిన డైలాగులు బాగున్నాయి. ప్రేమ కథలో కామెడీలో అదే కొత్తదనాన్ని చూపించుంటే బాగుండేది.

టెర్రరిజం మరియు చైనా కుట్ర

దేశ‌భ‌క్తి, తీవ్ర‌వాద స‌మ‌స్య‌కు సంబంధించి దర్శకుడు బషీర్ ఆలూరి రాత బాగున్నా…తీత‌లో త‌డ‌బ‌డిపోయారు. ఆర్టిస్టులు కొత్తవాళ్లు కావడం కూడా సినిమాకు మైనస్ అయింది అయితే నిర్మాత కొత్త వాళ్ళ మీద ఖర్చుపెట్టి తీశారు.

హీరోగా పరిచయమైన రవి ప్రకాష్ రెడ్డి తన పాత్ర వరకు న్యాయం చేశారు. యాక్టింగ్ ప‌రంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ముగ్గురు అమ్మాయిలలో ఇద్దరు కొన్ని సన్నివేశాలలో పాటల్లో గ్లామర్ వలకబోసారు. టేస్టీ తేజ కామెడీ కొన్ని చోట్ల వ‌ర్క‌వుట్ అయ్యింది. .

దేశభక్తి నేపథ్యంలో వ‌చ్చిన మూవీ ఇది. ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సినిమా రిలీజ్ కావ‌డం కొంత ప్ల‌స్స‌య్యింది.

మొత్తం మీద, 6 జర్నీ ఒక ఆసక్తికరమైన కథాంశంతో కూడిన సినిమా. కానీ కొన్ని సన్నివేశాలలో కన్ఫ్యూజన్ ఉండటం సినిమాకు మైనస్ పాయింట్.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.