|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

AA22: అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ.. అఫీషియల్

Published: 07-06-2025, 2:04 AM
AA22: అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ.. అఫీషియల్

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తర్వాత చిత్రం ‘AA22’ గురించి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఎంపికైన విషయం అధికారికంగా ప్రకటించబడింది. దీంతో అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు.

Key Points

1

అల్లు అర్జున్ – అట్లీ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఎంపిక.

2

దీపికా పదుకొణె, అల్లు అర్జున్ ఇద్దరికీ ఇది తొలి సహకారం.

4

'AA22' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

దీపికా పదుకొణె హీరోయిన్‌గా ఖరారు

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడా అని ఎదురుచూసిన అభిమానులకు.. కొన్నిరోజుల క్రితం సమాధానమిచ్చేశాడు. తమిళ దర్శకుడు అట్లీతో భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్న నేపథ్యంలో పలు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ఓ అప్‌డేట్ వచ్చేసింది. హీరోయిన్ ఎవరనేది ప్రకటించారు.

ప్రభాల్ ‘కల్కి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపికా పదుకొణెని అల్లు అర్జున్‌కి జోడీగా ఎంపిక చేశారు. బన్నీకి ఈమెతో పనిచేయడం తొలిసారే. కానీ దర్శకుడు అట్లీ మాత్రం తన గత చిత్రం ‘జవాన్’లో దీపికతో కలిసి పనిచేశాడు. ఇప్పుడు బన్నీతో చేయబోయే మూవీలోనూ ఈమెని హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశారు.

అల్లు అర్జున్ – దీపికా జోడీ

గత కొన్నిరోజుల నుంచి దీపికా పదుకొణె వార్తల్లో నిలుస్తోంది. ‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి వంగా ఈమెని అప్రోచ్ అయ్యాడు. దాదాపు సెట్ అనుకునే టైంలో ప్రాజెక్ట్ నుంచి దీపిక బయటకొచ్చింది. ఈ క్రమంలోనే స్టోరీని లీక్ చేయడం లాంటివి జరిగేసరికి సందీప్ వంగా.. ఈమె పేరు చెప్పకుండా పరోక్షంగా ట్వీట్ పెట్టాడు. మరోవైపు 8 గంటల షిఫ్ట్ కారణంగా ‘కల్కి 2’ నుంచి కూడా ఈమె తప్పుకోనుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇలా కాంట్రవర్సీ పుకార్లకు కేరాఫ్ అయిన దీపిక.. బన్నీ-అట్లీ మూవీ విషయంలో ఏం చేస్తుందో చూడాలి?

‘AA22’ చిత్రం అప్‌డేట్స్

దీపిక స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ.. కెరీర్ ప్రారంభం నుంచి హిందీలోనే సినిమాలు చేస్తూ వచ్చింది. పద్మావత్, రామ్ లీలా తదితర చిత్రాలు ఈమె చాలా గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక తనతో పాటు కలిసి సినిమాలు చేసిన రణ్‌వీర్ సింగ్ ని ఈమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు వీళ్లకు ఓ కూతురు కూడా పుట్టింది. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుంది కానీ ఇప్పుడు మళ్లీ బిజీ కానుంది.

చివరగా, అల్లు అర్జున్ మరియు దీపికా పదుకొణెల కాంబినేషన్‌తో ‘AA22’ చిత్రం భారీ అంచనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.