
📌 Key Points
- AA22: అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్! ఏప్రిల్ 8న టైటిల్ టీజర్ విడుదల
- హాలీవుడ్ రేంజ్ లో AA22 మూవీ! రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో అట్లీ దర్శకత్వం!
- AA22లో అల్లు అర్జున్ సూపర్ హీరోగా! దీపికా, మృణాల్, రష్మిక సందడి!
- సాయి అభ్యంకర్ మ్యూజిక్ సెన్సేషన్! టీజర్ కోసం అదిరిపోయే సంగీతం అందిస్తున్నాడు!
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న AA22 చిత్రం టాలీవుడ్ లో సంచలనం సృష్టించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. దీంతో బన్నీ అభిమానులకు పండగే.
ఏప్రిల్ 8న AA22 టీజర్ రిలీజ్!
AA22xA6: అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో చూస్తున్న సినిమా AA22. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందుకే, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణంలో వైరల్ అవుతోంది. అయితే, ఈ సినిమా మొదలై చాలా నెలలు గడుస్తున్నా ఎక్కడా చిన్న అప్డేట్ కూడా ఇవ్వడం లేదు మేకర్స్.
కనీసం లీకుడ్ పిక్స్ కూడా దొరకడం లేదు. అంతలా ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. కానీ, ప్రేక్షకుల్లో మాత్రం ఈ సినిమా గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత మాత్రం తగ్గడం లేదు. ఇవన్నీ గమనించిన మూవీ ఫైనల్ గా AA22(AA22xA6) సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఆ అప్డేట్ మరేదో కాదు AA22 మూవీ టైటిల్ టీజర్. అవును, అల్లు అర్జున పుట్టినరోజు ఏప్రిల్ 8న ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారట మేకర్స్.
రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో AA22!
దీనికి సంబందించిన బ్యాకెండ్ పనులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే, ఈ ఈవెంట్ ను భారీ ఎత్తున చేయాలనీ చూస్తున్నారట. వారణాసి సినిమా కోసం రాజమౌళి చేసిన ఈవెంట్ లాగా AA22 టైటిల్ టీజర్ రిలీజ్ ఈవెంట్ కోసం పెద్ద ఈవెంట్ నిర్వహించాలని ఫిక్స్ అయ్యారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్ నడుస్తోంది.
సూపర్ హీరోగా అల్లు అర్జున్!
ఇక లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ కూడా ఈ టీజర్ కోసం రంగంలోకి దిగుతున్నాడట. అదిరిపోయే మ్యూజిక్ అందించి ఆడియన్స్ ను తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేయనున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక AA22 సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో అల్లు అర్జున్ సూపర్ హీరోగా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ఫిమేల్ లీడ్స్ లో కనిపించనున్నారు. ఇక 2027లో ఈ సినిమా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లు అర్జున్ AA22 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


