|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆది సాయి కుమార్ హిట్: తండ్రి సాయి కుమార్ భావోద్వేగ కామెంట్స్ వైరల్!

Published: 25-12-2025, 3:45 PM
ఆది సాయి కుమార్ హిట్: తండ్రి సాయి కుమార్ భావోద్వేగ కామెంట్స్ వైరల్!
  • ఆది సాయి కుమార్ ‘శంబాల’ చిత్రం డిసెంబర్ 25న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది.
  • ప్రీమియర్‌ల నుంచే మంచి స్పందన, మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
  • కొడుకు విజయంపై సాయి కుమార్ పుత్రోత్సాహంతో, భావోద్వేగ వ్యాఖ్యలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
  • అనిల్ రావిపూడి సహా పలువురు ‘శంబాల’ బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ అభినందిస్తూ మెసేజ్‌లు పెట్టారు.

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. కొడుకు సినిమా విజయంపై తండ్రి సాయి కుమార్ పుత్రోత్సాహంతో మాట్లాడారు. అనిల్ రావిపూడి మెసేజ్, ప్రేక్షకుల స్పందన, డైరెక్టర్ యుగంధర్ కృషి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఆది సాయి కుమార్ ‘శంబాల’కు అద్భుత స్పందన

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో వేసిన ప్రీమియర్లకు మంచి స్పందన రావడం, మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్లతో చిత్రం దూసుకుపోతోండటంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గురువారం నాడు సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

సాయి కుమార్ పుత్రోత్సాహం: వైరల్ వ్యాఖ్యలు

సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘మా నాన్న గారు విజయనగరంలో ‘ప్రేమ కావాలి’ మూవీని చూసి నాకు చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. ఈ రోజు ప్రతీ చోటా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ మాటలు వింటే నాకు మళ్లీ ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. నా ఈ 50 ఏళ్లలో 300కి పైగా చిత్రాలు, వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. నేను ప్రతీ వారం వచ్చే చిత్రాల గురించి, వాటి ఫలితాల గురించి తెలుసుకుంటూనే ఉంటాను. ‘పోలీస్ స్టోరీ’కి హౌస్ ఫుల్ అవుతుందా? అనుకున్నాను. కానీ హాలు నిండినది అని బోర్డ్ చూసి నాకెంతో సంతోషం కలిగింది. మళ్లీ ఇప్పుడు ఆ మాటలు వింటున్నాను. శంబాల టీ షర్ట్ వేసుకుని నేను నిన్న థియేటర్ విజిట్‌కు వెళ్లాను. అలా వెళ్లిన ప్రతీ చోటా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి చెప్పినట్టుగా ఈ శుక్రవారం మేం హిట్టు కొట్టాం. అర్దరాత్రి నాకు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అని మెసెజ్ పెట్టారు. ప్రతీ చోటా నుంచి మాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది టికెట్ల కోసం ఫోన్ చేస్తున్నారు. దీనంతటికి కారణం డైరెక్టర్ యుగంధర్ ముని. ఆది కూడా నాలానే డైరెక్టర్ యాక్టర్. నా వాయిస్ ఓవర్ కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయిందని అంటున్నారు. సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ ఈ మూవీని యుగంధర్ అద్భుతంగా తీశారు. మంచి టీంతో మహీధర్ గారు, రాజశేఖర్ గారు తీసిన ఈ మూవీని ఆడియెన్స్ పెద్ద హిట్ చేశారు. ‘శంబాల’ వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది. కంటెంట్ ఉన్న చిత్రాలే విజయాన్ని సాధిస్తాయి. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్దాయి.. అన్ని చోట్ల నుంచి ఫోన్‌లు వస్తున్నాయి. మన ఆది హిట్ కొట్టాడని అందరూ ఫోన్‌లు చేస్తున్నారు.. పుత్రోత్సాహం అంటూ ఆడియెన్స్ నాకు చెబుతున్నారు. ‌ఇది ప్రజల విజయం. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి ఈ మూవీని గొప్పగా రూపొందించారు. త్వరలోనే ‘శంబాల’ టీం సక్సెస్ టూర్ నిర్వహిస్తుంది’ అని అన్నారు.

దర్శకుడు యుగంధర్ ముని విజయం, టీం కృషి

ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ని మీడియా ఎంతగానో సపోర్ట్ చేసింది. నా ఈ సినీ ప్రయాణంలో అండగా నిలిచిన మీడియాకి, అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్. మూవీని చూసిన వారంతా మెసెజ్‌లు చేస్తున్నారు. ‘శంబాల’ని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్. ప్రీమియర్ల నుంచి డే వన్‌కి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతూనే వచ్చాయి. చాలా కాంపీటిషన్‌లో విడుదలైనా కూడా ఆ మూవీ పెద్ద హిట్ అయింది. త్వరలోనే థియేటర్లు పెంచబోతోన్నాం. ఈ మూవీని కచ్చితంగా థియేటర్లోనే చూడండి. అప్పుడే మీరు పూర్తిగా ఎంజాయ్ చేయగల్గుతారు. హాలీడే సీజన్‌ను అందరూ ‘శంబాల’తో ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

‘శంబాల’ ప్రజల విజయం అని సాయి కుమార్ పేర్కొన్నారు. అన్ని చోట్ల నుంచి మంచి స్పందన వస్తున్న ఈ చిత్రం, కుటుంబమంతా కలిసి చూడదగ్గ గొప్ప చిత్రంగా నిలిచింది. దర్శకుడు యుగంధర్, చిత్ర యూనిట్ కృషికి ప్రేక్షకుల ఆదరణే నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.