
📌 Key Points
- ‘దీవాన’కు ముద్దు సీన్లు, వయలెంట్ సీన్లు లేకున్నా ‘A’ సర్టిఫికెట్ తో షాక్!
- సెన్సార్ బోర్డు క్రియేటివిటీని చంపుతోందని డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి భావోద్వేగం.
- పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ దూరం కావడంతో కలెక్షన్లపై ప్రభావం: నిర్మాతల ఆవేదన.
- ప్రేక్షకుల కోసం టికెట్ ధరలు తగ్గింపు: ‘దీవాన’ టీమ్ నుండి సంచలన ప్రకటన!
టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ ‘దీవాన’ సినిమా సెన్సార్ ఇష్యూ! కొత్త దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపుతోంది. ముద్దు సీన్లు లేకున్నా ‘A’ సర్టిఫికెట్ ఎందుకు? చిత్ర బృందం ఆవేదన వెనుక అసలు నిజం ఏంటి? పూర్తి వివరాలు చూసేద్దాం!
సెన్సార్ షాక్: ‘A’ సర్టిఫికెట్ వెనుక అసలు కథ!
హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘దీవాన’. శ్రీకాంత్ సంగిశెట్టి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మించారు. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 20న సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ సక్సెస్ మీట్ ను సోమవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుపై చిత్ర బృందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దీవాన’ సినిమాలో ముద్దు సీన్స్, వయలెంట్ సీన్స్ లేవని.. అయినా సరే సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారని ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి రాలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రీమియర్ షోలు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, కానీ సరైన సమయంలో సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం వల్లే ప్రీమియర్స్ ప్రదర్శించలేకపోయామని హీరో హర్షిత్ రెడ్డి అన్నాడు. సెన్సార్ పేరుతో ఫిలిం మేకర్స్ క్రియేటివిటీని, తమ సినిమా కలను చంపుతున్నారని డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ.. ”ఇవాళ నాలో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. మంచి సినిమా చేశారంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఫోన్ కాల్స్ ఆగడం లేదు. మరోవైపు మా సినిమాను ఇంకాస్త ఆడియెన్స్ లోకి తీసుకెళ్తే బాగుండేదని అనిపిస్తోంది. మేము రిలీజ్ ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో టూర్స్ ప్లాన్ చేశాం అయితే సెన్సార్ సర్టిఫికేషన్ వల్ల అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నాం. మా సినిమాలో ముద్దు సీన్స్ లేవు, వయలెంట్ సీన్స్ లేవు. అయినా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. మాలాంటి యంగ్ టీమ్ కు ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రేక్షకుల్ని కోరుతున్నాను. మీకు సినిమా నచ్చకుంటే డబ్బులు రిటర్న్ ఇస్తాం. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేటు 100 రూపాయలు పెడుతున్నాం. మల్టీప్లెక్స్ లతో మాట్లాడి అక్కడ కూడా ఒక రేట్ ప్రకటిస్తాం. ప్రేక్షకులందరికి మా సినిమాను మరోసారి రీచ్ చేయాలని అనుకుంటున్నాం. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్” అని అన్నారు. శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ.. ”దీవాన’ ప్రీమియర్స్ పడినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. భ్రమరాంభ థియేటర్లో షో జరుగుతుంటే ప్రేక్షకుల రెస్పాన్స్ పక్కనే ఉన్న మా ఇంటికి వినిపిస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాకు అలాంటి రెస్పాన్స్ వస్తుంటుంది. అది చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. అయితే ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుందామని అనుకుంటున్న వారికి 18 ఫ్లస్ అని చూపిస్తోంది. దాంతో సినిమాలో ఏముందో అని భయపడుతున్నారు. నేను ఒక ఆడపిల్లగా చెబుతున్నా. నాకు ఫ్యామిలీ ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులతో ధైర్యంగా చూసే సినిమా ఇదని గర్వంగా చెప్పగలను. మీరు థియేటర్స్ కు వచ్చి సినిమా చూడండి. అస్సలు డిజప్పాయింట్ అవ్వరు” అని అన్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ”తెలుగు ప్రేక్షకుల అభిరుచి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ‘దీవాన’ సినిమా ఆగదు. శతదినోత్సవం దాకా వెళ్తుంది. మన ఆడియన్స్ మంచి చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారు. మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండూ ఉన్నాయి. KGF సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు వచ్చే రెస్పాన్స్, ఈ మూవీలో చిన్న చిన్న డైలాగ్స్ కు కూడా వస్తోంది. థియేటర్ కు వెళ్తే హర్షిత్ ను ఆడియన్స్ చుట్టిముడుతున్నారు. అంతటి ప్రేమ చూపిస్తున్నారు. తెలుగు సినిమా మరే ఇతర భాషా చిత్రానికీ తక్కువ కాదు, మిగతా వాటికంటే గొప్పగా ఉండాలనే నేను ‘దీవాన’ చిత్రాన్ని రూపొందించాను. ఇందులో హీరో హీరోయిన్ల బాధను ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. ఇంకొందరు బాంబే నుంచి మన తెలుగు సినిమా గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెప్పగలను. తెలుగులో గత పదేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు. నెక్ట్స్ టెన్ ఇయర్స్ లో కూడా రాదు” అని అన్నారు. హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ”మేము ఒక గొప్ప చిత్రం చేశామని గర్వంగా చెబుతున్నా. ‘దీవాన’ సినిమా చూస్తే లవ్ అనే కాన్సెప్ట్ తో ఇప్పటి యూత్ లవ్ లో పడతారు. మేము ఒక రియల్ లైఫ్ ను చూపించాం. సినిమా చూసి చాలా మంది మెసేజులు పంపుతున్నారు. భ్రమరాంభ థియేటర్ లో మూవీ చూసి బయటకు వచ్చాక అందరూ నన్ను చుట్టుముట్టారు. ఇలాంటి లవ్ మా మూవీకి లభిస్తోంది. దీవాన ఒక టైమ్ లెస్ లవ్ స్టోరీ. మీరు ఎప్పుడూ చూసినా నచ్చుతుంది. మీకు ఈ సినిమా లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. మీ పేరెంట్స్ తో మీరు ఎలా ఉండేవారు అనేది గుర్తు చేస్తుంది. సెన్సార్ వాళ్లను గౌరవిస్తా కానీ, ఈ సినిమాకు మాత్రం వాళ్లు ఇంకా మంచి డెసిషన్ తీసుకోవాల్సింది. మేము అల్లు అరవింద్ గారు చెప్పిన సూచన మేరకు, ప్రీమియర్స్ వేసి మార్నింగ్ షోకు ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించాలని అనుకున్నాం. అయితే సెన్సార్ వారు చెప్పిన కట్స్ చేసి, మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించి సర్టిఫికేషన్ తీసుకున్నాం. ఈ ప్రాసెస్ లో ప్రీమియర్స్ వేయలేకపోయాం. ఇది ‘U/A’ సినిమా. థియేటర్స్ కు వస్తే మంచి ఎక్సిపీరియన్స్ ఇస్తాం. సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపాయలే టికెట్. మా సినిమాను సింగిల్ స్క్రీన్స్ లో చూస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది” అని అన్నాడు.
క్రియేటివిటీని చంపేస్తున్న సెన్సార్: దర్శకుడి ఆవేదన!
ప్రేక్షకులకు ‘దీవాన’ టీమ్ విజ్ఞప్తి: టికెట్ ధర తగ్గింపు!
‘దీవాన’ టీమ్ ఆవేదన, సెన్సార్ బోర్డు నిర్ణయంపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి!


