|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆది సాయి కుమార్ ‘ప్రేమ కావాలి’ మళ్ళీ థియేటర్లలో! రీ రిలీజ్ డేట్ ఫిక్స్!

Published: 14-03-2026, 11:05 PM
ఆది సాయి కుమార్ 'ప్రేమ కావాలి' మళ్ళీ థియేటర్లలో! రీ రిలీజ్ డేట్ ఫిక్స్!
  • ఆది సాయి కుమార్ నటించిన ‘ప్రేమ కావాలి’ సినిమా ఏప్రిల్ 25న రీ రిలీజ్ కానుంది.
  • ఈ సినిమా 2011లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
  • ఆది సాయి కుమార్ ఈ సినిమా ద్వారా ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిలింఫేర్ సౌత్ పురస్కారం పొందారు.
  • గతంలో రీ రిలీజ్ అయినపుడు కూడా ‘ప్రేమ కావాలి’ మంచి ఆదరణ పొందింది.

ఆది సాయి కుమార్ నటించిన మొదటి సినిమా ‘ప్రేమ కావాలి’ మళ్లీ విడుదల కానుంది. గతంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఏప్రిల్ 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

‘ప్రేమ కావాలి’ రీ రిలీజ్ వివరాలు

Prema Kavali Re Release: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar)ఒకరు. ఈయన సీనియర్ నటుడు సాయికుమార్ వారసుడిగా ప్రేమ కావాలి(Prema Kavali) అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ హీరోగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఆది అనంతరం సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. కానీ ఈయన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ ఇవన్నీ నేపథ్యంలో ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇటీవల ఆది శంభాల అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈయన ప్రస్తుతం తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆది సాయికుమార్ నటించిన మొట్టమొదటి సినిమా ప్రేమ కావాలి తిరిగి మరోసారి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కే విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది సాయికుమార్ ఇషా చావ్లా(Eesha Chawla) హీరో హీరోయిన్లుగా నటించారు. 2011 జనవరి 25వ తేదీ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా గత ఏడాది కూడా రీ రిలీజ్ అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం మరోసారి ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 25వ తేదీ ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. ఇలా మరోసారి సాయికుమార్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఆది ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిలింఫేర్ సౌత్ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు.

సినిమా విశేషాలు

#premakavali pic.twitter.com/HH6w5LV6s2

— Aadi Saikumar (@iamaadisaikumar) March 14, 2026

ఆది సాయి కుమార్ సినీ ప్రస్థానం

ఈ చిత్రం ఆది నటించిన మొట్టమొదటి సినిమా అవ్వటమే కాకుండా ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు రావడం, అలాగే 100 రోజులు థియేటర్లలో విజయవంతంగా ఆడిన సినిమా అని కూడా చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆది సినిమాల విషయానికి వస్తే.. శంభాల సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్న ఈయన తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు అయితే ఇప్పటివరకు ఆది తన తదుపరి సినిమాని అధికారకంగా ప్రకటించలేదు. ప్రస్తుతం కథలు వినే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇటీవల వరుస సినిమాలు నిరాశపరచడంతో ఆది కథకు పూర్తి ప్రాధాన్యత ఇస్తూ అలాంటి సినిమాలలోనే నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఆది సాయి కుమార్ కి ఈ సినిమా ఒక మైలురాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా రీ రిలీజ్ అవుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.