
బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ తన ప్రేమ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ తో ఉన్న సంబంధం గురించి, మరియు తన మూడో పెళ్ళి గురించి అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Key Points
అమిర్ ఖాన్ తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో ప్రేమలో ఉన్నారు.
అతను గౌరీని ఇప్పటికే హృదయంతో పెళ్లాడాడని చెప్పాడు.
అధికారిక వివాహంపై నిర్ణయం త్వరలో తీసుకుంటారని అమిర్ తెలిపారు.
ఇది అమిర్ ఖాన్ మూడో వివాహం అవుతుంది.
అమిర్ ఖాన్ మరియు గౌరీ స్ప్రాట్ సంబంధం
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. లాల్ సింగ్ చద్ధా తర్వాత అమిర్ చేసిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి . 2018 లో వచ్చిన మూవీకి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు . ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ హీరో .
మూడో పెళ్లిపై అమిర్ ఖాన్ వ్యాఖ్యలు
అయితే ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అమిర్ ఖాన్ మరోసారి రిలేషన్ లో ఉన్నారు . తన చిన్ననాటి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్ ప్రారంభించారు . తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు . ప్రస్తుతం గౌరీతో రిలేషన్ లో ఉన్న అమిర్ ఖాన్ .. మూడో పెళ్లిపై స్పందించారు . గౌరీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు అమిర్ ఖాన్ తెలిపారు . మేమిద్దరం చాలా నిజాయితీ , నిబద్ధతతో ఉన్నామని అన్నారు . మీకు తెలుసా ? మేము ప్రస్తుతం భాగస్వాములని .. ఇప్పటికే తన హృదయంతో ఆమెను పెళ్లాడానని అమిర్ ఖాన్ ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇచ్చారు . మేము కలిసి ఉన్నామని .. అయితే అధికారికంగా పెళ్లి చేసుకోవాలా ? వద్దా ? అనే దానిపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అమిర్ ఖాన్ తెలిపారు .
అమిర్ ఖాన్ గత వివాహాలు
కాగా .. ఈ సంవత్సరం మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్ ను అఫీషియల్ గా ప్రకటించారు . అమిర్ వయస్సు 60 ఏళ్లు కాగా .. గౌరీకి (46) అతనికి దాదాపు 14 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు . ఇప్పటికే అమిర్ ఖాన్ 1986 లో మొదట రీనా దత్తాను పెళ్లాడారు . ఆ తర్వాత 2002 లో విడిపోయారు . మరో మూడేళ్లకు డైరెక్టర్ కిరణ్ రావును వివాహమాడారు . వీరిద్దరు 2021 లో విడాకులు తీసుకున్నారు . ప్రస్తుతం మూడో పెళ్లికి సిద్ధమయ్యారు మన బాలీవుడ్ స్టార్ హీరో .
అమిర్ ఖాన్ మరియు గౌరీ స్ప్రాట్ భవిష్యత్తు ఏమిటో తెలియదు, కానీ వారి సంబంధం ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచుతోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.


