
📌 Key Points
- అమీర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ కలిసి జీవిస్తున్నట్లు వెల్లడి.
- వివాహం అంటే మనసుల కలయికేనని అమీర్ ఖాన్ అభిప్రాయం.
- గత ఏడాది గౌరీని అందరికీ పరిచయం చేసిన అమీర్ ఖాన్.
- ఇటీవలే కొత్త ఇంట్లోకి అడుగు పెట్టనున్న జంట.
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన రిలేషన్ గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. గౌరీ స్ప్రాట్‌తో కలిసి జీవిస్తున్నానని, వారి దృష్టిలో అది వివాహమేనని తెలిపారు. ఈ ప్రకటనతో ఆయన అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
గౌరీతో రిలేషన్‌పై అమీర్ ఖాన్ క్లారిటీ
Aamir Khan : బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అమీర్ ఖాన్ ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈయన కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం తన పెళ్లిళ్లు విడాకుల ద్వారా తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్ ప్రస్తుతం గౌరీ స్ప్రాట్ అనే మహిళతో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి రిలేషన్ గురించి గత కొంతకాలంగా ఎన్నో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా అమీర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీతో తన రిలేషన్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడమే కాకుండా మేము పెళ్లి చేసుకున్నాం అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా తన రిలేషన్ గురించి వస్తున్న వార్తలకు అమీర్ ఖాన్ చెక్ పెట్టారు. తన ప్రియురాలు గౌరీతో తాను కలిసి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నట్లు తెలిపారు.”మా దృష్టిలో వివాహం అంటే రెండు మనసుల కలయిక ఆ రకంగా చూస్తే మేము ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లే “అంటూ అమీర్ ఖాన్ వీరిద్దరి రిలేషన్ గురించి తెలియజేశారు. ఇక ఈ బంధాన్ని చట్టబద్ధంగా లేదా అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారనేది భవిష్యత్తులో నిర్ణయించుకుంటామని తెలియజేశారు. దీంతో అమీర్ ఖాన్ గౌరీ రిలేషన్ కి సంబంధించిన ఈ వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
వివాహంపై అమీర్ ఖాన్ కొత్త నిర్వచనం
అమీర్ ఖాన్ తన రెండవ భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కొంతకాలం పాటు సింగిల్ గానే కనిపించారు. అయితే గత ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా ఈయన గౌరీని అందరికీ పరిచయం చేస్తూ ఊహించని షాక్ ఇచ్చారు. బెంగళూరుకు చెందిన గౌరీను పరిచయం చేయడమే కాకుండా ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా వీరిద్దరూ జంటగా కనిపిస్తున్న నేపథ్యంలో వీరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఇటీవలే వీరిద్దరూ కొత్త ఇంట్లోకి కూడా అడుగు పెట్టబోతున్నట్లు అమీర్ ఖాన్ తెలియజేశారు.
ఇద్దరి భార్యలకు విడాకులు..
కొత్త ఇంట్లోకి అడుగు పెట్టనున్న జంట
ఇక అమీర్ ఖాన్ మొదటి భార్య విషయానికి వస్తే ఈమె పేరు రీనా దత్తా. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల అమీర్ ఖాన్ తన కుమార్తె ఐరా ఖాన్ వివాహం జరిపించిన సంగతి తెలిసిందే . అభిప్రాయ బేధాల కారణంగా రీనా దత్తకు విడాకులు ఇచ్చిన అనంతరం అమీర్ ఖాన్ 2005 వ సంవత్సరంలో కిరణ్ రావు అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కూడా ఒక కుమారుడు ఉన్నారు. వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా వీరు విడాకులు తీసుకొని విడిపోయినా, ఏదైనా కార్యక్రమాలకు వెళ్లిన జంటగా కనిపిస్తున్నారు అలాగే కలిసి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇక తన రెండో భార్యకు విడాకులు ఇచ్చిన అనంతరం అమీర్ ఖాన్ గత ఏడాది కొత్త గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేయటం గమనార్హం.
అమీర్ ఖాన్ మరియు గౌరీల రిలేషన్ గురించి వస్తున్న వార్తలకు ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు. వారి బంధం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఈ ప్రకటన బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


