|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aamir Khan: రీనాతో విడాకులు.. అలాగే చనిపోవాలనుకున్నా: అమిర్ ఖాన్

Published: 29-06-2025, 9:50 AM
Aamir Khan: రీనాతో విడాకులు.. అలాగే చనిపోవాలనుకున్నా: అమిర్ ఖాన్

తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ తన మాజీ భార్య రీనా దత్తాతో విడిపోయిన తర్వాత ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించాడు. ఆయన తీవ్ర మద్యవ్యసనం, ఆత్మహత్య ప్రయత్నం గురించి మాట్లాడాడు.

Key Points

1

అమిర్ ఖాన్ రీనాతో విడాకుల తర్వాత తీవ్ర మద్యవ్యసనంతో బాధపడ్డాడు.

2

ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడని అమిర్ వెల్లడించాడు.

4

రీనాతో అమిర్ ఖాన్ రహస్యంగా వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

రీనాతో విడాకులు మరియు మద్యవ్యసనం

ఇటీవలే సితారే జమీన్‌ పర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్ స్టార్‌ హీరో అమిర్ ఖాన్. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఆమిర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్‌ ఫిల్మ్‌ ‘తారే జమీన్  పర్‌’ (2007)కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ జెనీలియా కీలక పాత్రలో నటించారు. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించగా ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్‌  నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమిర్ ఖాన్.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య రీనా దత్తాతో విడిపోయాక ఎదుర్కొన్న పరిస్థితిని వివరించారు. ఆ టైమ్‌లో తీవ్రమైన ఒత్తిడి, బాధకు గురయ్యానని వెల్లడించారు. దీంతో మద్యానికి బానిసైనట్లు తెలిపారు. నా సినిమా లగాన్‌ విజయం సాధించినప్పటికీ.. జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించదన్నారు. అది తన జీవితంలో చీకటిదశ అని పేర్కొన్నారు.

ఆత్మహత్య ప్రయత్నం మరియు మానసిక స్థితి

అమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘రీనాతో నేను విడిపోయినప్పుడు ఆ రోజు సాయంత్రంమే మద్యం ఫుల్ బాటిల్ తాగాను. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ మద్యం తాగాను. ఆ సమయంలో ఎప్పుడూ నిద్రపోలేదు. అధిక మద్యం సేవించడం వల్ల నేను స్పృహ కోల్పోయేవాడిని. ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించా. ఆ సమయంలో ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదు. అదే ఏడాది నా సినిమా లగాన్ రిలీజైంది. అప్పట్లో నన్ను మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని పిలిచారు. అది నాకు చాలా వ్యంగ్యంగా అనిపించింది’ అని పంచుకున్నారు.

‘లగాన్’ విజయం మరియు వ్యక్తిగత జీవితం

కాగా.. ఆమిర్, రీనా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అంతేకాదు అమిర్ ఖాన్ తన రక్తంతో ఆమెకు ఒక లేఖ కూడా రాశాడు. రీనా మొదట అమిర్ ప్రేమను అంగీకరించలేదు.. కానీ తరువాత ఓకే చెప్పి.. ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా రీనా దత్తా ఆమిర్ మొదటి చిత్రం ‘ఖయామత్ సే ఖయామత్ తక్’లో కూడా ఒక చిన్న పాత్ర పోషించింది. వీరి వివాహమైన 16 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఈ జంటకు జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమిర్ 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ జంట 16 సంవత్సరాల తర్వాత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆమిర్ ప్రస్తుతం తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్‌లో ఉన్నారు.

అమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను, విడాకుల తర్వాత ఎదుర్కొన్న ఒత్తిడిని, మానసిక పోరాటాలను బహిరంగంగా పంచుకోవడం అభినందనీయం. ఆయన అనుభవాలు చాలా మందికి స్ఫూర్తినిస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.