
తాజాగా విడుదలైన సితారే జమీన్ పర్ సినిమాతో అమిర్ ఖాన్ ప్రేక్షకులను అలరించారు. అయితే, మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై ఆయన సినిమా చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
Key Points
అమిర్ ఖాన్ తాజాగా సితారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.
మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై సినిమా చేస్తున్నారన్న వార్తలను అమిర్ ఖాన్ ఖండించారు.
ఈ రూమర్స్‌కు ఎలాంటి ఆధారాలు లేవని, అభిమానులు గందరగోళానికి గురికాకూడదని ఆయన కోరారు.
అమిర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌లో నటించబోనని స్పష్టం చేశారు.
సితారే జమీన్ పర్ సినిమా విజయం
బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే సితారే జమీన్ పర్ మూవీతో ప్రేక్షకులను అలరించారు . గతనెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది . గతంలో విడుదలై హిట్ గా నిలిచిన సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు . ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు . ఇప్పటివరకు మరో ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ను అమిర్ ఖాన్ ప్రకటించలేదు.
అయితే ఇటీవల మేఘాలయలో సోనమ్ హనీమూన్ ఎపిసోడ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే . ఈ ఉదంతంపై అమిర్ ఖాన్ సినిమా చేయనున్నారని బాలీవుడ్ లో టాక్ . ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి అన్ని వివరాలు సేకరిస్తున్నారని బీటౌన్ లో వైరలవుతోంది . తన సన్నిహితులతో చర్చిస్తున్నారని .. తన ప్రొడక్షన్‌లోనే ఈ కేసుపై సినిమా తీసే అవకాశం ఉందని లేటేస్ట్ గా వినిపిస్తోన్న మాట.
మేఘాలయ హనీమూన్ కేసుపై రూమర్స్
అయితే తనపై వస్తున్న వార్తలపై అమిర్ ఖాన్ స్పందించారు . మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై సినిమాను రూపొందిస్తున్నట్లు వస్తున్న వార్తలను అమీర్ ఖాన్ కొట్టిపారేశారు . తనపై వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు . ఇలాంటి రూమర్స్ ఎలాంటి వాస్తవ ఆధారం లేకుండానే వస్తాయని .. దీనివల్ల అభిమానులు అనవసరమైన గందరగోళానికి గురవుతారని అమిర్ ఖాన్ అన్నారు . ఇలాంటి ప్రాజెక్ట్ లో తాను నటించబోనని స్పష్టం చేశారు . ఈ కథనాలు ఎక్కడ , ఎలా మొదలవుతాయే నిజంగా తనకు తెలియదన్నారు .
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు
అమిర్ ఖాన్ స్పందన
రాజా రఘువంశీ అనే యువకుడితో మే 11న సోనమ్ పెళ్లి జరిగింది. అదే నెల 20న నవదంపతులు హనీమూన్ ( Meghalaya Honeymoon Murder Case) కోసం మేఘాలయ వెళ్లారు. కేవలం వెళ్లడానికే తప్ప తిరిగి రావడానికి టికెట్లు బుక్ చేసుకోలేదు. మే 23న దంపతులు స్కూటీపై ఓ టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లారు. తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత (జూన్ 2న) రఘువంశీ మృతదేహం లభ్యమైంది. అతడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. అతడిని దగ్గరుండి చంపించింది మరెవరో కాదు భార్య సోనమ్. సోనమ్‌కు రాజాతో పెళ్లి ఇష్టం లేదు. కారణం.. అప్పటికే ఆమె రాజ్ కుష్వాహను ప్రేమిస్తోంది. ఇంట్లోవాళ్లు ఈ ప్రేమకు ఒప్పుకోలేదు.
మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై సినిమా చేస్తున్నారన్న వార్తలను అమిర్ ఖాన్ తోసిపుచ్చారు. ఇటువంటి వార్తలు అభిమానులను గందరగోళపరచడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.


