
📌 Key Points
- అమీర్ ఖాన్ ప్రతి విమాన ప్రయాణానికి ముందు ‘డెత్ నోట్’ రాస్తాడు.
- ఆ నోట్ లో తన సినిమాను పూర్తి చేయమని సోదరుడు మన్సూర్ ఖాన్ ను కోరతాడు.
- ఫ్లైట్ జర్నీ అంటే భయమని, సినిమా మధ్యలో ఆగకూడదని అమీర్ ఆశయం.
- మన్సూర్ ఖాన్ తో అమీర్ కు మూడు దశాబ్దాల సినీ బంధం ఉంది.
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన సినిమా కమిట్ మెంట్ ను మరోసారి నిరూపించుకున్నారు. విమాన ప్రయాణానికి ముందు తాను రాసే ‘డెత్ నోట్’ రహస్యాన్ని బయటపెట్టారు. తన సోదరుడు, దర్శకుడు మన్సూర్ ఖాన్‌కు పంపే ఈ సందేశం వెనుక ఆయన అంకితభావం స్పష్టమవుతోంది.
అమీర్ ఖాన్ ‘డెత్ నోట్’ వెనుక రహస్యం
Aamir Commitment : సినిమాపై తనకెంత కమిట్ మెంట్ ఉందో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. తాను ఫ్లైట్ జర్నీ ఎప్పుడు చేసినా ఒక సీక్రెట్ నోట్ తప్పకుండా రాస్తానని, తను ఏ క్షణాన చనిపోయినా, తను చేసే సినిమా ఆగకూడదని ఆ నోట్ సమ్మరీ అంటూ చెప్పిన మాటలు బీటౌన్ లో తెగ హైలెట్ అవుతున్నాయ్.
తాను ఫ్లైట్ జర్నీ లో చనిపోతే
మ్యాటర్ ఏంటో చూస్తే అమీర్ లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకి ఫ్లైట్ జర్నీ అంటే చాలా భయమని, ముఖ్యంగా ఏదైనా సినిమా షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంటే మరింత భయం అవుతుందని మనసులోని మాటని బయటపెట్టాడు. ఒక వేళ గనుక తాను ఫ్లైట్ జర్నీ లో చనిపోతే చేస్తున్న సినిమా ఏమైపోవాలి అనే ఆలోచన నుండే ఈ సీక్రెట్ నోట్ పుట్టింది అంటూ చెప్పుకొచ్చాడు.
మన్సూర్ ఖాన్ తో అమీర్ బంధం
అందుకే ఇక విమానం ఎక్కుతాననగా తన సోదరుడు, ప్రముఖ డైరెక్టర్ మన్సూర్ ఖాన్‌కు ఆ నోట్ పంపిస్తానని, ఎలాగైనా ఆ సినిమాని దగ్గరుండి పూర్తీ చేయాలని చెబుతానని తెలిపాడు. మన్సూర్ కి నోట్ పంపడమే కాకుండా ముందే ఆ సినిమా సభ్యులతో మన్సూర్ ఖాన్ తో సినిమా కలిసి కంప్లీట్ చేయాలని చెబుతానంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు అమీర్.
అమీర్ – మన్సూర్ మధ్య రిలేషన్ విషయానికి వస్తే వీరిద్దరి కాంబోలో 1988లో వచ్చిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ తోనే అమీర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సినిమా ఎలాంటి కల్ట్ స్టేటస్ కొట్టేసిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు కూడా.
ఆ తర్వాత నాలుగేళ్ళకి అంటే 1992లో వచ్చిన ‘జో జీతా వహీ సికందర్’ సినిమా కూడా సాలిడ్ బ్లాక్ బస్టర్ అయిందే. ఇక 1995లో వచ్చిన ‘అకేలే హమ్ అకేలే తుమ్’ సినిమాకి దర్శకత్వం వహించింది కూడా మన్సూర్ ఖానే. అలా దాదాపు మూడు దశాబ్దాల విడదీయని బంధమే అమీర్ మన్సూర్ ఖానే కావాలని కోరుకొవడానికి కారణం, పైగా వీరిద్దరూ దగ్గరి బందువులు కూడా.
సినిమా పట్ల అమీర్ అంకితభావం
ఇక అమీర్ సినిమా పట్ల ఎంతటి కమిట్ మెంట్ చూపుతాడో ‘లగాన్’ (2001), ‘దంగల్’ (2016) వంటి సినిమాలనే ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.
మొత్తానికి అమీర్ ఖాన్ కి ఉన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనే ట్యాగ్ ని మరోసారి ఈ సీక్రెట్ నోట్ తో ప్రూవ్ చేసుకున్నాడన్న మాట!
మొత్తంగా, అమీర్ ఖాన్ తన సినిమా పట్ల ఎంతటి అంకితభావం కలిగి ఉన్నారో ఈ ‘డెత్ నోట్’ ఉదంతం మరోసారి రుజువు చేసింది. తన సోదరుడిపై ఆయనకున్న నమ్మకం, సినీ రంగంపై ఆయనకున్న ప్రేమ అద్భుతం.


