
రామ్ చరణ్, చిరంజీవి కుటుంబాలు లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా నటి అభినయ, తన భర్తతో కలిసి చిరంజీవి, రామ్ చరణ్‌లను కలిసి ఫొటో దిగింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Key Points
అభినయ, తన భర్తతో కలిసి లండన్‌లో చిరంజీవి, రామ్ చరణ్‌లను కలిశారు.
ఈ కొత్త జంట చిరు, చరణ్ కుటుంబంతో ఫొటో దిగారు.
మెగా ఫ్యాన్స్ ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు.
లండన్‌లో మెగాస్టార్ కుటుంబ సమావేశం
Abhinaya : రామ్ చరణ్, చిరంజీవి ఫ్యామిలీలతో ప్రస్తుతం లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే. లండన్ లో చరణ్ మైనపు విగ్రహం లాంచ్, RRR ప్రత్యేక ప్రదర్శన ఉండటం, వాటితో పాటు వెకేషన్ కి కలిసి ఫ్యామిలీ అంతా లండన్ వెళ్లారు. చిరు, చరణ్ ఫ్యామిలీతో లండన్ లో తిరుగుతున్న పలు ఫోటోలు ఇటీవల లీక్ అయ్యాయి.
అభినయ, భర్తతో కలిసి చిరు, చరణ్‌లను కలిశారు
అయితే తాజాగా నటి అభినయ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి లండన్ లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమిళ్, తెలుగులో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలతో మెప్పించిన నటి అభినయ ఇటీవల ఏప్రిల్ 16న తన ప్రియుడు కార్తీక్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతరం వీరు హనీమూన్ కి లండన్ వెళ్లారు.
వైరల్ అవుతున్న ఫోటో
అక్కడ చిరంజీవి ఫ్యామిలీ కనపడటంతో ఈ కొత్త జంట చిరు, చరణ్ లతో కలిసి స్పెషల్ ఫొటో దిగారు. ఈ ఫోటోని అభినయ తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫైర్ సింబల్స్ పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో వైరల్ అవ్వగా మెగా ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబాలతో అభినయ, ఆమె భర్త కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోకు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.


