|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గ్లిజరిన్‌ లేకుండా సహజంగా నటించాం: ఆకాంక్షా సింగ్‌

Published: 22-05-2025, 4:52 PM
గ్లిజరిన్‌ లేకుండా సహజంగా నటించాం: ఆకాంక్షా సింగ్‌

నటి ఆకాంక్షా సింగ్ తన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ గురించి మాట్లాడుతూ, రాజేంద్రప్రసాద్‌తో కలిసి గ్లిజరిన్ లేకుండా సహజంగా నటించిన విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో ఆమె గ్రామీణ అమ్మాయి పాత్రను పోషించారు.

Key Points

1

ఆకాంక్షా సింగ్ 'షష్టిపూర్తి'లో జానకి పాత్రలో నటించారు.

2

రాజేంద్రప్రసాద్‌తో కలిసి గ్లిజరిన్ లేకుండా సహజంగా నటించారు.

4

ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తున్నారు.

‘షష్టిపూర్తి’ సినిమా విశేషాలు

‘‘తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పే చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా చేస్తున్న సమయంలో మా నాన్న గుర్తొచ్చారు. ఆయన్ని నేను చాలా మిస్‌ అయ్యాను. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడాల్సిన చిత్రమిది. తల్లిదండ్రులను ప్రేమించండి…  వారితో ఎక్కువ సమయాన్ని గడపండి’’ అని హీరోయిన్‌ ఆకాంక్షా సింగ్‌ తెలిపారు. రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేష్, ఆకాంక్షా సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్‌ ప్రభ దర్శకత్వంలో హీరో రూపేష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆకాంక్షా సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ–‘‘షష్టిపూర్తి’లో జానకి అనే గ్రామీణ అమ్మాయి పాత్ర చేశాను. అచ్చమైన తెలుగమ్మాయిలా లంగా ఓణిలో స్క్రీన్‌పై కనిపించడం నాకిదే తొలిసారి. ఇక ‘బెంచ్‌ లైఫ్‌’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారితో నటించాను. ఇప్పుడు ‘షష్టిపూర్తి’లో చేశాను. మేమిద్దరం ఎప్పుడు కలిసి నటించినా భావోద్వేగ సన్నివేశాల కోసం గ్లిజరిన్‌ వాడలేదు. సహజంగానే నటించేస్తాం. కథ, పాత్ర నచ్చితే వెబ్‌ సిరీస్‌లో అయినా నటిస్తాను. యాక్షన్‌ చిత్రాలంటే ఎక్కువగా ఇష్టం. ప్రస్తుతం తెలుగులో ఓ యాక్షన్‌ మూవీ చేస్తున్నాను. తమిళంలో ఒక సినిమా ఒప్పుకున్నాను’’ అని తెలిపారు.

ఆకాంక్షా సింగ్ నటన గురించి

భవిష్యత్తు ప్రాజెక్టులు

గ్లిజరిన్ లేకుండా సహజ నటనతో ఆకట్టుకున్న ఆకాంక్షా సింగ్, తన భవిష్యత్తు ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగు, తమిళ చిత్రాలలో వారి నటనకు మంచి స్పందన లభిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.