
📌 Key Points
- శోభన్ బాబు సలహాతో శరత్ బాబుకి భారీగా ఆస్తులు; మొత్తం విలువ రూ. 200 కోట్లు పైమాటేనట!
- హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో నటించిన శరత్ బాబు సంచలన నిర్ణయం.
- చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో శరత్ బాబుకి భారీగా ఆస్తులు ఉన్నాయని సమాచారం.
- స్థలం కొంటే లైఫ్ సెటిల్ అయినట్టే అని శోభన్ బాబు ఇచ్చిన సలహా వెనుక అసలు కథ.
టాలీవుడ్ లో ఒక సంచలనం! శోభన్ బాబు గారి సలహా ఒక స్టార్ హీరో జీవితాన్ని మార్చేసింది. ఆయన ఇచ్చిన సలహా పాటించి, ఏకంగా 200 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ఆ హీరో ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు!
శోభన్ బాబు ఇచ్చిన గోల్డెన్ రూల్ ఏమిటో తెలుసా?
ఒకప్పుడు టాలీవుడ్‌లో రొమాంటిక్ హీరో అంటే.. శోభన్ బాబు పేరు మాత్రమే వినిపించేది. ఆంధ్రా అందగాడు, సోగ్గాడు, అందాల నటుడు, నటభూషణ్… ఇలా శోభన్ బాబు ను ముద్దు పేర్లతో పిలిచే వారు అభిమానులు. కోట్లాది అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన శోభన్ బాబు… కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఆర్ధిక కష్టాలు అనుభవించారు.
కనీసం ఇంట్లో ఫాన్ కూడా లేని రోజుల్లో తన కుటుంబంతో కలిసి సింగిల్ రూమ్ లో నివసించారు శోభన్ బాబు. అన్ని కష్టాలు అనుభవించారు కాబట్టే.. ఆయన డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. సినిమాల నుంచి వచ్చిన డబ్బుతో ఎక్కువగా స్థిరాస్తులు కొనుగోలు చేశారు శోభన్ బాబు. ఎక్కువగా స్థలాల మీద ఇన్వెస్ట్ చేసేవారు శోభన్ బాబు.
తన కో ఆర్టిస్ట్ లు.. తన తరువాత వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ లకు కూడా శోభన్ బాబు ఇదే సలహా ఇచ్చేవారు. ఉన్న డబ్బును స్థలాల మీద ఇన్వెస్ట్ చేయండని చాలామంది నటీనటులకు ఆయన సలహా ఇచ్చారు. శోభన్ బాబు సలహా పాటించకపోవడం వల్ల కోట్ల ఆస్తులు పోగోట్టుకున్నామని జయసుధ లాంటి స్టార్స్ ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఆయన మాటలు విని వందల కోట్లు సంపాధించిన వారు కూడా ఉన్నారు. శోభన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, ఇలా ఎంతో మంది స్టార్స్ శోభన్ బాబు మాట విని.. కోట్లకు పడగలెత్తారు. ఈక్రమంలో సోగ్గాడు మాటలు విని 200 కోట్లకు పైగా ఆస్తులు పోగేసిన నటుడు ఎవరో తెలుసా?
శరత్ బాబు ఆస్తుల వెనుక అసలు కథ ఇదే!
..ఆ నటుడు ఎవరో కాదు శరత్ బాబు… అవును శరత్ బాబు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో నటించారు. సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ తో ముఖ్యమైన నగరాల్లో శరత్ బాబు ప్రాపర్టీస్ కొనడం స్టార్ట్ చేశాడు. చెన్నైలో భారీ బంగ్లా, షాపింగ్ కాంప్లక్స్, బెంగళూర్ లో ఇల్లు, కాంప్లెక్స్, హైదరాబాద్ లో ఇల్లు, ఆముదాల వలసలో ఇల్లు.. కొన్ని భూములు కూడా కొన్నాడట శరత్ బాబు. మొత్తంగా ఆయన దాదాపు 200 కోట్ల ఆస్తులను సంపాదించినట్టు.. ఆకాలంనాటి జర్నలిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇండస్ట్రీలో అందరు తనను పీనాసి అనడంపై శోభన్ బాబు ఓసందర్భంలో క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ.. ” అందరు నన్ను పిసినారి అంటున్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ ఓ మాట అంటుండేవారు.
నా అభిమానులందరికి తలా ఒక్క రూపాయి ఇచ్చుకుంటూ వెళ్తే.. ఆతరువాత ఆ రూపాయి నేను అందరిని అడుక్కోవలసి వస్తుంది.. అని అనేవారు. అందుకే నేను అపాత్రదానం చేయను. అర్ధం లేని చోట ఎక్కువ ఖర్చు పెట్టడం అనవసం. అవసరం ఉన్న చోట మాత్రమే నేను ఖర్చు చేస్తాను. అది నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాదు. నన్ను నమ్ముకున్న 60 కుటుంబాలను దృష్టిలో పెట్టుకునినేను జాగ్రత్తగా ఉంటాను.
ఆ రోజుల్లో శోభన్ బాబు గురించి షాకింగ్ నిజాలు!
ఆ 60 కుటుంబాలకు నేను ఎంత చేశాను, ఏం చేశాను, ఎంత మంది నావల్ల చదవుకుంటున్నారు, మంచి పోజిషన్ లో ఉన్నారు అనేది నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. దానం చేసి చెప్పుకోవలసిన అవసరం కూడా లేదు. ఎవరు ఎన్ని అన్నా.. నేను ఏం చేశాను అన్నది నాకు తెలుసు” అని శోభన్ బాబు అన్నారు.
శోభన్ బాబు డబ్బును వృధా చేసేవారు కాదు. ఆయన సంపాధించిన సొమ్మ అంతా బిజినెస్ లో పెట్టారు. ప్రతీ పైసా ఆయన భూమిపై పెట్టారు. చెన్నైలో సగం భూములు ఆయనవే. దాదాపు 10 వేల కోట్ల విలువైన ఆస్తులను సంపాదించారట శోభన్ బాబు. ఆయన హీరోగా ఎంత స్టార్ డమ్ చూసినా.. తన ఫ్యామిలీని మాత్రం ఇండస్ట్రీలోకి రానివ్వలేదు అందాల నటుడు.
తన దగ్గర పనిచేసేవారిని చాలా బాగా చూసుకునేవారు శోభన్ బాబు. పనివారి కుటుంబాలక కావల్సిన ఆర్ధిక అవసరాలు శోభన్ బాబు దగ్గరుండి చూసుకునేవారు. వారి పిల్లలను కూడా ఆయన చదివించేవారు. శోభన్ బాబు గుప్తదానాల గురించి మరో హీరో కృష్ణం రాజు ఓ సందర్భంలో గొప్పగా చెప్పారు.
శరత్ బాబు గారు శోభన్ బాబు గారి మాట విని ఎలా కోట్లు సంపాదించారో చూశారుగా. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


