|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విప్లవ వీరుడు గద్దర్ పేరు పెట్టి ఇలా చేస్తారా?.. అందుకే నా సినిమా పంపలేదు.. నటుడు కీలక వ్యాఖ్యలు

Published: 29-05-2025, 7:33 AM
విప్లవ వీరుడు గద్దర్ పేరు పెట్టి ఇలా చేస్తారా?.. అందుకే నా సినిమా పంపలేదు.. నటుడు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన తర్వాత నటుడు బండి సరోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన సినిమాను అవార్డులకు పంపకపోవడానికి కారణాలను ఆయన వివరించారు.

Key Points

1

గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటనపై నటుడు బండి సరోజ్ కుమార్ తీవ్ర విమర్శలు

2

అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక

4

బండి సరోజ్ కుమార్ తన సినిమాను అవార్డులకు పంపకపోవడానికి కారణం వివరించారు

గద్దర్ ఫిల్మ్ అవార్డులు ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను (Gaddar Film Awards) గురువారం ప్రకటించారు. ఈ అవార్డులను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు(Dil Raju)తో కలిసి జ్యూరీ చైర్‌పర్సన్‌ జయసుధ(Jayasudha) ప్రకటించారు. తాజాగా.. ఈ అవార్డుల ప్రకటనపై నటుడు బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.

‘అప్పట్లో నంది అవార్డ్స్ అనౌన్స్ చేశాక ఈ సినిమాలు ఎప్పుడొచ్చాయి? ఈ నటులు ఎవరు? అని వెతుక్కుని మరీ చూసేవాళ్ళం. ఇప్పుడు ఒక విప్లవ వీరుడు గద్దర్ పేరు పెట్టి ఫేమస్ చిత్రాలకే అవార్డులు ఇస్తున్నారు. ఇదంతా నేను ముందే ఊహించాను. అందుకే నా సినిమాను పంపలేదు. జాతీయ అవార్డుకు మాత్రమే పంపుదాం అనుకున్నాను. ఇప్పుడు అక్కడికి కూడా పంపను. కమర్షియల్ హిట్టు కొడితే.. అవార్డులు కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

బండి సరోజ్ కుమార్ విమర్శలు

కాగా, గద్దర్ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించి.. అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా ‘పుష్ప 2’ చిత్రానికి గానూ అల్లు అర్జున్‌ (Allu Arjun) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా కల్కితో పాటు మరో రెండు సినిమాలకు అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రంంగా ప్రభాస్ నటించిన కల్కి2898ఏడీ, ఉత్తమ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (కల్కి), ఉత్తమ నటి: నివేదా థామస్‌ (35 చిన్న కథ కాదు), ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్‌ (రజాకార్‌) ఇలా మొత్తం అన్ని కేటగిరీలకు అవార్డులు ప్రకటించారు.

అవార్డు గ్రహీతలు

గతంలో ఇవ్వొద్దని.. నేడు అదే సినిమా హీరోకి అవార్డు.. గద్దర్ అవార్డులపై బీజేపీ తీవ్ర విమర్శలు..

గద్దర్ అవార్డులపై నటుల నుండి వ్యక్తమవుతున్న అభిప్రాయాలు తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. కమర్షియల్ విజయం కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.