|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండిగోపై నరేశ్ తీవ్ర ఆగ్రహం: బస్సులు టార్చర్ చాంబర్లు! లీగల్ యాక్షన్ వార్నింగ్

Published: 24-12-2025, 3:06 PM
ఇండిగోపై నరేశ్ తీవ్ర ఆగ్రహం: బస్సులు టార్చర్ చాంబర్లు! లీగల్ యాక్షన్ వార్నింగ్
  • నటుడు నరేష్ హైదరాబాద్ నుంచి మైసూర్ వెళ్లే ఇండిగో విమానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • విమానం వద్దకు తీసుకెళ్లే బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
  • సీనియర్ సిటిజన్లు, వీల్‌చైర్ ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
  • ఇండిగో ఎయిర్‌లైన్స్ తీరుపై న్యాయ పోరాటం చేస్తానని, లీగల్ యాక్షన్ తీసుకుంటానని నరేష్ హెచ్చరించారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్ తీరుపై టాలీవుడ్ నటుడు నరేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం వద్దకు తీసుకెళ్లే బస్సులో ఓవర్‌లోడింగ్‌పై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ అనుభవంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఇండిగోపై న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

నరేష్ ఆగ్రహానికి కారణం ఏంటి?

ఇండిగో ఎయిర్ లైన్స్ (IndiGo Airlines) సంస్థ తీరు ఇటీవల వివాదాస్పదం అవుతోంది. చెప్పాపెట్టకుండా విమానాల రద్దుతో ప్రయాణికులు ప్రత్యక్ష నరకం అనుభవించిన సంగతి మరువక ముందే ఆ సంస్థ తీరుపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇండిగో సంస్థపై యాక్టర్ నరేశ్ (Actor Naresh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హైదరాబాద్ నుంచి మైసూర్ వెళ్లేందుకు ఇండిగో విమానంలో టికెట్ పర్చేజ్ చేశారు. ఎయిర్ పోర్టులో విమానం వద్దకు తీసుకువెళ్లే ఇండిగో బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లోని బస్సులు టార్చర్ చాంబర్లుగా మారాయని ఇవి ఎయిర్‌లైన్ గుత్యాధిపత్యానికి బాధాకరమైన ఉదాహరణలుగా నిలుస్తున్నాయని తన అనుభవాలను ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను పశువుల్లో బస్సులోకి కుక్కుతున్నారని చాలా మంది సీనియర్ సిటిజన్లు కూడా నిలబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వీల్‌చైర్లలో ఉండి నిలబడలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారని బస్సును ఓవర్ లోడ్ చేయాలని తాను గొంతు చించుకుని అరవాల్సి వచ్చిందన్నారు. బస్సులకు తప్పనిసరిగా ఒక నిర్దిష్ట ప్రయాణికుల పరిమితి ఉండాలని అలాగే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్థలం కల్పించాలని రాసుకొచ్చారు. ఇండిగో తీరుపై న్యాయ పోరాటం చేస్తానని లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు.

ఇండిగోపై “టార్చర్ చాంబర్” ఆరోపణలు

న్యాయ పోరాటానికి నరేష్ సంకల్పం

నటుడు నరేష్ ఇండిగోపై వ్యక్తం చేసిన ఆగ్రహం, లీగల్ వార్నింగ్ చర్చనీయాంశంగా మారాయి. ప్రయాణికుల భద్రత, ఎయిర్‌లైన్స్ బాధ్యతపై ఈ ఘటన కొత్త చర్చకు దారితీసింది. నరేష్ న్యాయ పోరాటం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.