
బుల్లితెర హీరో తరుణ్ తేజ్ తండ్రి అయ్యాడు. తాజాగా తనకు కూతురు జన్మించిన విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Key Points
సూపర్ స్టైలిష్ హీరో తరుణ్ తేజ్ కు కూతురు జన్మించింది.
తరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ శుభవార్తను పంచుకున్నాడు.
నెటిజన్లు, సెలబ్రిటీలు తరుణ్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.
తరుణ్ ప్రస్తుతం ‘మౌన పోరాటం’, ‘సీతే రాముడి కట్నం’ సీరియల్స్‌లో నటిస్తున్నాడు.
తరుణ్ తేజ్ కు కూతురు జన్మ
సూపర్ స్టైలిష్ బుల్లితెర హీరో తరుణ్ తేజ్(Tharun Tej) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రజెంట్ ఈటీవీలో ప్రసారమయ్యే ‘మౌన పోరాటం'(Mouna Poratam) సీరియల్‌లో ఆయన హీరోగా యాక్ట్ చేస్తున్నారు. అలాగే జీ తెలుగులో ప్రసారమయ్యే సూపర్ హిట్ సీరియళ్లలో ఒకటైన ‘సీతే రాముడి కట్నం’ అనే ధారావాహికలోనూ కొత్త హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అలా ఓ పక్క సీరియల్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ మరోపక్క ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇందులో భాగంగా రీసెంట్‌గా ‘ఉండి పోరాదే’ అనే సాంగ్ చేశాడు. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నాడు.
ఈ క్రమంలో తరుణ్ తేజ్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా తరుణ్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో గత నెల 26వ తేదీ సాయంత్రం 5గంటల 51నిమిషాలకు తనకు బేబీ గర్ల్(అమ్మాయి) పుట్టిందని తెలుపుతూ.. తన గారాల పట్టి అతని చేతిని పట్టుకున్న ఫొటోస్ షేర్ చేశాడు. అంతేకాకుండా ‘కూతురంటే అమ్మకు ప్రతిరూపం.. నాన్నకు ఆమే ఓ లోకం’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. సెలబ్రిటీలు, అతని అభిమానులు నెటిజన్లు అతనికి కంగ్రాట్స్ చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్
అభిమానుల నుండి అభినందనలు
తన కూతురు జన్మతో తరుణ్ తేజ్ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ శుభవార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


