
తమిళ నటుడు ఆరవ్ నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. తన ‘ఆరవ్ స్టూడియోస్’ ద్వారా విజువల్స్, క్రియేటివ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. మంచి, సహజమైన కథలతో చిత్రాలను నిర్మించాలనే ఆసక్తితో ఈ సంస్థను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
Key Points
తమిళ నటుడు ఆరవ్ ఇప్పుడు నిర్మాతగా మారారు.
మణిరత్నం 'ఓ కాదల్ కణ్మణి' చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు.
'ఆరవ్ స్టూడియోస్' పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు.
సహజమైన, ఎవరూ చెప్పని కథలతో చిత్రాలు చేయాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం.
ఆరవ్ సినీ ప్రస్థానం
తమిళ నటుడు ఆరవ్ ( Aarav ) నిర్మాతగా మారారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఓ కాదల్ కణ్మణి చిత్రం ద్వారా ఆరవ్ నటుడిగా పరిచయం అయ్యారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఆ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు మిత్రుడిగా నటించారు. ఆ తరువాత సైతాన్, విడాముయర్చి (పట్టుదల) వంటి కొన్ని చిత్రాల్లో నటించిన ఈయన మార్కెట్ రాజా, ఎంబీబీఎస్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొని మరింత పాపులర్ అయిన ఆరవ్ ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. ఆరవ్ స్టూడియోస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
‘ఆరవ్ స్టూడియోస్’ ఆవిష్కరణ
దీని గురించి తెలియజేస్తూ.. పలు ఏళ్లుగా ప్రేక్షకుల ప్రేమ, అంగీకారం లభించినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. అందమైన సినీ పరిశ్రమలో తననూ ఒక భాగంగా మార్చిందన్నారు. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడానికి ఆరవ్ స్టూడియోస్ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. మంచి కథలను చెప్పాలనే తపన, ఆసక్తి నుంచి ఈ సంస్థ పుట్టిందన్నారు. ఈ విజువల్స్, క్రియేటివ్ ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎవరూ చెప్పని సహజమైన కథలతో చిత్రాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. భగవంతుడి ఆశీస్సులు, సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి కథా చిత్రాలను నిర్మిస్తాననే నమ్మకంతో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ఆరవ్ తెలిపారు.
నిర్మాతగా ఆరవ్ లక్ష్యాలు
బిగ్‌బాస్ ద్వారా మరింత పాపులర్ అయిన ఆరవ్, ఇప్పుడు నిర్మాతగా సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. సినీ ప్రేక్షకులను అలరించే మంచి కథా చిత్రాలను నిర్మిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


